మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో విధిని తప్పించలేక పంచమకన్యతో అతనికి జరిగిన వివాహం గురించి, వివాహానంతరం పొందిన సంతానాన్ని వరరుచి వదలిపెట్టటం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం!
తనకు కలిగిన 11 మంది కుమారులను నిర్దాక్షిణ్యంగా అడవిలో పొత్తిళ్లలోనే వదిలిన వరరుచి భార్య, తనకు ఒక బిడ్డను పెంచుకోవాలని కోరిక బలంగా కలిగింది. అందుకే తనకు 12 వ సారి ప్రసవవేదన మొదలవగానే అడవిలోని పొదల చాటుకువెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పటి వలెనే వరరుచి "ఆ బిడ్డకు నోరు ఉందా" అని అడిగాడు. పిల్లవాడిని తానే పెంచుకోవాలి అనే కోరిక ఉన్న ఆమె వెంటనే ఆ బిడ్డకు నోరులేదు అని చెప్పింది. ఆ తరువాత బిడ్డను చూస్తే నిజంగానే అప్పుడు పుట్టిన ఆ బిడ్డకు నోరులేదు.
అప్పుడు వరరుచి ఆ నోరులేని పిల్లవాడిని ఒక కొండమీద దేవతలా ప్రతిష్టించి తన భార్యతో కలసి దారిన అతను యాత్రలలో వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతను కాలధర్మం చేసాడు.
మరి అడవిలో వదిలిన ఆ 11 మంది పిల్లలు ఎం అయ్యారు?
వారిని వివిధజాతులకు చెందిన కుటుంబాలు పెంచుకుని వారి వారి కుటుంబ సంప్రదాయాలను వారి ద్వారా కొనసాగేలా చేసుకున్నారు. కేరళలో ప్రసిద్ధమయిన జానపద కధలలో ఈ వరరుచి కధ ఒకటి. వారికి కలిగిన సంతానం, వారు పెరిగిన కులం/జాతి/వృత్తి ఇప్పుడు తెలుసుకుందాం!
- మేళత్తూళ్ అగ్నిహోత్రి : నిత్యఅగ్నిహోత్రులు
- పాక్కనార్ : పంచమజాతి
- రజకుడు :: చాకలి
- నారణతు బ్రాహ్మణ :నాయి బ్రాహ్మణ
- కారెక్కాల్ మాత :: వరరుచి సంతానంలో ఒకేఒక ఆడపిల్ల
- అకవూర్ చాటన్ :: వైశ్య
- వడుతల నాయర్ : సైనిక
- తిరువళ్ళువర్: తమిళనాట ప్రముఖ కవి , కన్యాకుమారిలో సముద్రములో పెద్ద విగ్రహం ఉంటుంది
- ఉప్పుకొట్టం : ముస్లిం
- పాణనర్ : సంగీత కారుడు
- పేరుంథచ్చం :: వడ్రంగి
- వాయిళ్ళకుణ్ణిల్ అప్పన్ : నోరులేని కొండమీది దేవత