28, ఫిబ్రవరి 2015, శనివారం

ధనుష్కోటి - మేలుకోటి

ధనుష్కోటి కూడా మేలుకోటిలోని ఒక చూడ దగిన ప్రదేశం. మీరు శారీరిక ధారుడ్యం కలవారైతే తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన, అందమైన, సుమనోహరమైన ప్రదేశం. మీ శారీరిక ధారుడ్యంఅంత బాగోలేదు అనుకుంటే....... !
my parents coming down from dhanushkoti

ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడకు వచ్చారు అని చెప్పుకున్నాం కదా! ఈ ధనుష్కోటి కూడా వారికి సంబందించిన ప్రత్యేకమైన ప్రదేశం.
సీతారాములు విహారం కోసం ఈ కొండపైకి వచ్చారట. అప్పుడు సీతామాతకు విపరీతమైన దాహం వేసిందట. ఆమె అవస్థ చుసిన శ్రీ రాముడు తన ధనుస్సు తీసుకుని ఒక బాణమును ఆ కొండయొక్క ఒక రాతి మీద ప్రయోగించారట. అప్పుడు ఆ రాతినుండి ఎప్పటికీ ఎండిపోని ఒక జల బయటకు వచ్చినదట. సీత మాత  ఆ జలముతో తన దప్పికను తీర్చుకొన్నదట.   ధనుస్సు ఉంది ప్రయోగించబడిన బాణము కొనవలన జలము ఉద్భవించినది కనుక ఈ ప్రదేశమును ధనుష్కోటి అని పిలిచారట.
ఈవిధంగా చెప్పబడిన ఆ జలం నేటికి కూడా ఎండిపోకుండా ఉన్నది. ఐతే ఆ నీరు త్రాగుటకు వీలుగా లేవు. ఐతే ఆ జలమును మనం తలపై ప్రోక్షించుకొనుటకు యోగ్యంగా ఉన్నవి.
source: internet

ఆ ప్రక్కనే సీతారాముల ఆలయం ఉన్నది.

శ్రీ సీతా రాముల పాద ముద్రలు కూడా ఇక్కడ చూడ వచ్చు. ఐతే ఇక్కడ వచ్చిన తరువాత అక్కడి ప్రకృతి రమణీయత అత్యంత అద్భుతం.


ధనుష్కోటికి మేల్కోటి చెలువ నారాయణుని దేవాలయం నుండి రాయగోపురం మీదుగా నడచి చేరుకొన వచ్చును. ఐతే ఆ కొండ ఎక్కటం అంత తేలిక ఐన విషయం కాదు. అ కొండ క్రింది వరకూ  కావాలంటే మీ వీలును బట్టి ఏదయినా వాహనంలో చేరుకొన వచ్చును.
ఇక్కడ చూపించినది ఆ కొండ యొక్క క్రింది భాగం. ఆ ఫోటోలో కనిపిస్తున్నంతవరకు ఏదయినా వాహనంలో రావచ్చును. 

26, ఫిబ్రవరి 2015, గురువారం

దేవుడు నరునిగా అవతరించాడా? - అనే ఒక ప్రశ్నకు సమాధానం

దేవుడు నరునిగా అవతరించాడా? 

అనే ఒక ప్రశ్నకు సమాధానం గా ఈ టపా రాస్తున్నాను. 

దేవుడు మనిషిగా అవతరించాడో లేదో మనం ఇప్పుడు ఇక్కడ కుర్చుని చెప్పలేము. మీరు చెప్పిన ధార్మిక గ్రంధముల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి అనే నినాదంతో నేను ఏకీభవిస్తున్నాను. మీరు ఉటంకించిన భగవద్గీత శ్లోకములు మీ భావమునకు మంచి సామర్ధ్యమును తెచ్చి పెట్టాయి. 
మీరు చెప్పిన శ్లోకములకు మీకు అర్ధం మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 
  అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ:
               పరం భావ మజానంతే వమామయ మనుత్తమం. గీత:7:24

ఈ శ్లోకం లో చెప్పిన "మాం" అనే పదమునకు అర్ధం చెప్తారా? "మాం" అంటే సంస్కృతం లో అర్ధం "నేను" అని. అంటే శ్రీకృష్ణుడు తనగురించి తాను భగవంతునిగా చెప్పుకుంటున్నాడు. 

మీరు చెప్పిన అర్ధం ఇప్పుడు సరిగా చూడండి. "నా పూర్తి స్వభావం తెలియని మందబుద్దులు నన్ను కేవలం పంచభూతాత్మకమైన శరీరంగా తలుస్తారు" అని. అంతే కానీ నీను ఎప్పుడూ  అవతరించలేదు అని కాదు. మీకు సమాధానం దొరికినది అని భావిస్తున్నాను.   

ఆణిముత్యాలు-1

మనం ఎటువంటి ఉరిలో నివాసం ఉండాలో మన పెద్దలు సంస్కృతంలో ఇలా చెప్పారు

ధనిక: శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ: l
పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివనం వసేత్ ll

ఇదే శ్లోకం తెలుగులో సుమతీ శతక కర్త ఈ విధంగా చెప్పాడు.

అప్పిచ్చు వాడు వైద్యుడు 
ఎప్పుడు నెడతెగక పారు నేరు ద్విజుడున్ 
చొప్పడిన యూరనుండుము 
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి.  

భావం: ధనవంతుడు, వేద శాస్త్రములు చదివి వానిని నిరంతరం అనుగమించె బ్రాహ్మణుడు, ధర్మ మరియు న్యాయముల ప్రకారం పరిపాలన చేయు రాజు, ఆహారం పండించుటకు పొలమును తడుపుటకు ఉపయోగపడే నీరు కలిగిన నది, ఇంకా వైద్యుడు అనే ఈ ఐదుగురూ ఉందని ఊరిలో ఒక్క రోజు కూడా ఉండకూడదు.

సంస్కృతంలో చెప్పిన పై శ్లోకం చాణుక్యుడు చెప్పినట్లుగా ఉన్నది. ఈ శ్లోకం తెలుగులోనికి తీసుకు వచ్చిన సుమతీ శతక కర్త ఒక న్యాయ పరమైన పరిపాలన సాగించే రాజు కూడా ఆ ఊరిలో ఉండాలి అని ఎందుకు చెప్పలేదో మరి!

25, ఫిబ్రవరి 2015, బుధవారం

నక్షత్రములు - అధిపతులు

మనం ఇంతకు ముందు నక్షత్రములు 27 అనీ, వారు దక్షుని పుత్రికలు అనీ వారిపేర్లు కుడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ నక్షత్రముల అధిపతుల గురించి తెలుసుకుందాం.
  1. అశ్విని  కి అధిపతి అశ్వినీ దేవతలు 
  2. భరిణి కి అధిపతి యముడు 
  3. కృత్తిక కి అధిపతి అగ్ని 
  4. రోహిణి కి అధిపతి బ్రహ్మ 
  5. మృగశిర కి అధిపతి చంద్రుడు 
  6. ఆరుద్ర కి అధిపతి శివుడు 
  7. పునర్వసు కి అధిపతి  అదితి 
  8. పుష్యమి కి అధిపతి గురుడు 
  9. ఆశ్లేష కి అధిపతులు సర్పములు 
  10. మాఘ/ మఖ కి అధిపతులు పితృ దేవతలు   
  11. పూర్వ ఫల్గుని కి అధిపతి భగుడు అనే సూర్యుడు
  12. ఉత్తర ఫల్గుణి కి అధిపతి అర్యముడు అనే సూర్యుడు
  13. హస్త కి అధిపతి సూర్యుడు 
  14. చిత్త కి అధిపతి  ఇంద్రుడు 
  15. స్వాతి కి అధిపతి వాయువు 
  16. విశాఖ కి అధిపతులు ఇంద్రుడు మరియు అగ్ని 
  17. అనురాధ కి అధిపతి మిత్రుడు అనే సూర్యుడు 
  18. జ్యేష్ట కి అధిపతి ఇంద్రుడు 
  19. మూలా కి అధిపతి రాక్షసుడు 
  20. పుర్వాషాడ కి అధిపతి వరుణుడు 
  21. ఉత్తరాషాడ కి అధిపతులు విశ్వేదేవతలు 
  22. శ్రవణ కి అధిపతి విష్ణువు 
  23. ధనిష్ఠ కి అధిపతులు అష్టవసువులు 
  24. శతభిష కి అధిపతి వరుణుడు 
  25. పూర్వాభాద్ర కి అధిపతి కజచరణుడు 
  26. ఉత్తరాభాద్ర కి అధిపతి ఆహిర్భుద్న్యు డు 
  27. రేవతి కి అధిపతి పూషుడు అనే సూర్యుడు 

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

రాయ గోపురం/ సీతారామ గోపురం

మేల్కొటేలో  చూడదగిన ప్రదేశాలలో రాయ గోపురం/ సీతారామ గోపురం అని పిలువబడే ఈ ప్రదేశంలోనే శ్రీ సీతారాములు ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికిన స్థలం అని చెప్తారు. ఐతే ఈ గోపురం తన శిల్పకళా నైపుణ్యంతో చిరస్థాయిగా తనపేరు నిలుపుకున్న శ్రీ జక్కన మహాశిల్పి ఒక్క రాత్రిలో చెక్కారు అని మరో కధనం.
జక్కన గారి ప్రత్యర్ధులు జక్కన శిల్పకళా నైపుణ్యం పరిక్షించదలచి, వారిని ఒక్కరాత్రి లో ఈ గోపురమును నిర్మించమని షరతు విధించారట. ఆ షరతుకు అంగీకరించిన జక్కన ఈ గోపురమును నిర్మించటం మొదలు పెట్టారట. ఐతే మధ్యరాత్రికి దాదాపుగా సగంపూర్తయిన చూసి, తెల్లవారేసరికి జక్కన ఈ గోపురం పూర్తిగా నిర్మించాగలడు కనుక వారి ఓటమిని ముందుగా ఉహించిన ఆ ప్రత్యర్ధులు నాలుగవ ఝాము వచ్చేసినది అనేటట్లుగా ఆ అర్ధరాత్రి సమయంలో గంటలు మొగించారట. తన శిల్పకళా నైపుణ్యం మరొకరి స్వార్ధం ముందుఓడిపోయినది అని తెలుసుకున్న జక్కన గారు ఈ గోపురమును పుర్తిచేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారట.
ఇప్పటికి ఇక్కడ నాలుగు స్తంభాలు, వాని చుట్టూ శిల్పకళా ఖండాలు ఉంటాయి తప్ప వాటి పైన గోపురం ఉండదు.  ఈ రాయగోపురం శ్రీ యాదవగిరికి చేరుకునేందుకు ముఖద్వారంగా ఉంటుంది.

ఈ గోపురమును చేరుకోవాలంటే కాళ్ళకు కొంచెం పని చెప్పాల్సిందే. దారి కొండరాళ్ళతో మలచి ఉంటుంది.

పైకి వెళ్ళాక అక్కడ నుండి మెల్కోటే అందాలను చూసిన వారికి ఇది పెద్ద విషయంగా అనిపించదు. చెలువనారయణుని దేవాలయం నుండి కేవలం 10 నిముషములలో ఈ రాయగోపురమునకు నడచి చేరుకోవచ్చు. 

23, ఫిబ్రవరి 2015, సోమవారం

మేలుకోటిలోని తిరునారాయణ వైరముడి

 వైరముడి అనేది మేలుకోటి లో కొలువై ఉన్న ఆ చెలువ నారాయణుని కిరీటం పేరు. ఇంతకుముందు మనం మెల్కోటే కు చెలువనారాయణుడు, రామప్రియ ఎలాచేరుకున్నారో చెప్పుకున్నాం కదా! మరి ఈ కిరీటం ఏమిటో, అంత గొప్ప కిరీటం ఇక్కడకు ఎలా చేరినదో, దానిని ఎప్పుడు ఎలా దర్శించ గలమో తెలుసుకుందామా?

శ్రీ హరి ఒకసారి పాల సముద్రంలో పవళించి ఉండగా పరమ భక్తాగ్రేస్వరుడయిన ప్రహ్లాదుని కుమారుడు, విరోచనుడు శ్రీహరి పవిత్రమైన కిరీటమును   దొంగిలించాడు. అలా తీసుకువెళ్ళిన కిరీటమును విరోచనుడు ఎవరికీ తేలియని ప్రదేశంలో దాచి ఉంచాడు. అప్పుడు శ్రీహరి తన వాహనమయిన గరుక్మంతుని తన కిరీటం ఎక్కడ ఉన్నదో వెదకి తనకు తెచ్చి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడు గరుక్మంతుడు ఆ కిరీటమును గురించి దశ దిశలా వెదక సాగాడు. చివరకు ఆ కిరీటం జాడ తెలుసుకుని ఆ కిరీటమును కనుగొని, దానిని శ్రీహరికి సమర్పించాలి అనే తొందరలో ఆ కిరీటమును ముక్కున కరచుకొని పయనం సాగించాడు. అప్పుడు వాడి అయిన గరుక్మంతుని ముక్కు తగిలి ఆ కిరీటమునకు పొదగ బడిన ఒక అపూర్వమైన నీలి రత్నం ఒకటి రాలి నేలపై పడినది. ఆ రత్నం పడిన చోటునుండి ఒక నది ప్రారంభం ఐయి ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిని చింతామణి అని పిలిచారు. (ఇప్పటికీ  ఈ నది తంజావూరు వద్ద ఉన్నది )
గరుక్మంతుడు అత్యంత శ్రమించి తెచ్చిన శ్రీవారి కిరీటం వారికి సమర్పించటానికి ఆత్రుతగా గరుడుడు శ్రీవైకుంఠ పురమునకు చేరుకున్నారు. కాని అప్పటికి శ్రీహరి భూలొకం లో అవతరించారు అని తెలుసుకుని, కించిత్ నిరుత్సాహమునకు లోనయ్యి ఎలా అయినా శ్రీఘ్రంగా శ్రీహరికి ఈ కిరీటం అందించాలి అనే సంకల్పంతో గరుక్మంతుడు అతివేగంగా భూలోకమునకు వచ్చి శ్రీహరి గురించి అనేక ప్రదేశములు వెదకారు. చివరకు రేపల్లెలో తన మిత్రులతో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని చూసి అమితానందం పొందారు. ఆ కిరీటం బాలకృష్ణుని తలపై ఉంచారు. అది ఆబాలగోపాలమును పరిపాలించే బాలగోపాలుని తలకు సరిగ్గా సరిపోయినది. ఆ కిరీటం ధరించిన బాల కృష్ణుని చూసిన గరుక్మంతుడు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు స్వయంగా రామప్రియకు ఆ కిరీటమును ఉంచి పూజించేవారు.  తరువాతి కాలంలో శ్రీకృష్ణుడు రామప్రియతో పాటుగా ఆ కిరీటమును కూడా తీసుకు వచ్చి మేల్కోటలో ఉన్న చెలువనారాయణ దేవాలయంలో ఉంచారు అని ఇక్కడి పురాణం.
ఈ కిరీటమును వైరముడి అంటారు. చెలువ నారాయణుడు కూడా ఈ కిరీటమును సంవత్సరమునకు ఒక్కరోజే ధరిస్తారు. అది బ్రహ్మోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఈ వైరముడి బ్రహ్మోత్సవం దర్శించటానికి కొన్ని లక్షలమంది మేల్కొటేకు చేరుకుంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 30 నుండి జరుగుతుంది.        
ఈవైరముడి మిగిలిన రోజులు కర్నాటక ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఈ కిరీటము అస్సలు సూర్యరశ్మి ప్రవేశించకుండా ఉండేటట్లుగా ఉన్నటువంటి పెట్టెలలో భద్రపరుస్తారట. అంతేకాదు, ఈ కిరీటం చెలువనారాయణుని తలపై ఉన్నపుడు తప్ప విడిగా చూడకూడదట.
మరి అందుకే స్వామివారి తలపై ఈ కిరీటమును ధరింపచేసే ఆ ఆలయ ముఖ్య పూజారి కూడా ఆ కిరీటము ఉన్న పెట్టెను శ్రీ రామానుజాచార్యుల వారి ముందు ఉంచి, తన కన్నులకు సన్నని వస్త్రమును కట్టుకుని, అప్పుడు ఆ పెట్టెను తెరిచి, శ్రీవారికి ఆ కిరీటం అలంకరింపచేస్తారట.
అది సంగతి. ఇటువంటి అధ్బుతమైన, అపుర్వమిన ఒక ఉత్సవం మన పక్క రాష్ట్రం లో మర్చి 30, 2015 వ తారీకున జరుగుతుందట. పిల్లలకు పరిక్షలు ఐపోయి ఎక్కడకు వెళ్దామా అని ఆలోచిస్తున్న వారు చక్కగా బెంగళూరు, మైసూరు, ఇంకా మెల్కోటే వెళితే బాగుంటుంది కదా!