అంకెలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంకెలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, డిసెంబర్ 2021, మంగళవారం

అష్టవసువులు

మనం  ఇంతకు ముందు నక్షత్రముల అధిపతుల గురించి, నందిని ధేనువు గురించి చెప్పుకున్న సందర్భంలో మనం  అష్టవసువులు గురించి విన్నాం! ఇంతకీ ఈ అష్టవసువులు ఎవరు?

వీరి పేర్లు గురించి అనేక సందర్భాలలో అనేక రకములుగా చెప్పినా, మహాభారతంలోని ఆదిపర్వంలో చెప్పిన ఈ కింది శ్లోకంలో వారి పేర్లు చెప్పారు

ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో అనలః

ప్రత్యూష శ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః  

  1. ధరుడు 
  2. ధ్రువుడు 
  3. సోముడు 
  4. అహస్సు 
  5. అనిలుడు 
  6. అనలుడు 
  7. ప్రత్యూషుడు 
  8. ప్రభాసుడు 

11, డిసెంబర్ 2021, శనివారం

విక్రమాదిత్యుడు - నవరత్నాలు

భారత దేశంలో రాజుగా ఉండి సాహితీవేత్త గా పేరుసంపాదించుకున్న వారిలో ముఖ్యులు దక్షిణాదిలో శ్రీకృష్ణదేవరాయలు అయితే ఉత్తరాదిలో ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుడు ఒకరు. 
విక్రమాదిత్యుడు తన ఆస్థానంలో తొమ్మిది మంది కవులను కలిగిఉన్నాడని కొన్ని శాసనాలలో చెప్పబడింది. ఆ తొమ్మిది మందిని కలిపి నవరత్నాలు అంటారని తెలుస్తుంది. ఆ తొమ్మిది మంది పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం!
  1. విద్యాసింహుడు
  2. ధన్వంతరి 
  3. ఘాటకరూర్ 
  4. కాళిదాసు 
  5. క్షపనక 
  6. శంఖుడు 
  7. వరాహమిహిరుడు 
  8. వరరుచి 
  9. బేతాళ భట్ట 

10, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన అష్టదిగ్గజములు

మనం ఇంతకు  ముందు అష్టదిగ్గజములు అంటే భూమిని ఎనిమిది దిక్కులలో మోసే ఎనిమిది ఏనుగులు అని, వాటి పేర్లు చెప్పుకున్నాం  కదా! ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం లో ఉన్నఅష్టదిగ్గజముల గురించి తెలుసుకుందాం!

శ్రీకృష్ణదేవరాయలు మన చరిత్రలో గొప్ప రాజు, వీరునిగానే కాక ఒక గొప్ప కవిగా, సాహిత్యవేత్తగా కూడా పేరు సంపాదించుకున్నారు. వారి ఆస్థానం లో ఎనిమిది మంది గొప్ప మేధావులయిన కవులు ఉండే వారని వారినే అష్టదిగ్గజములు అంటారని మనకు తెలుసు కదా1 మరి ఆ ఎనిమిది మంది పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం! 
  1. అల్లసాని పెద్దన 
  2. నంది తిమ్మన 
  3. మాదయ్యగారి మల్లన 
  4. ధూర్జటి 
  5. అయ్యలరాజు రామభద్రుడు 
  6. పింగళి సూరన 
  7. రామరాజభూషణుడు 
  8. తెనాలి రామకృష్ణ 

8, జూన్ 2020, సోమవారం

సప్త వ్యసనములు

మనం ఇంతకుముందు కామం వలన జనించిన 10 వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అసలు సప్త వ్యసనములు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం!
మానవుని జీవితంలో అత్యంత పాపమునకు కారణమయినవి  ఏడు వ్యసనములు. అవి 
  1. వేట 
  2. మద్యపానం 
  3. చాడీలు చెప్పటం 
  4. అబద్దాలు చెప్పటం 
  5. దొంగతనం 
  6. జూదం 
  7. పరస్త్రీ సంగమం 

14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

5, మే 2020, మంగళవారం

షట్చక్రవర్తులు

మన పురాణములలో అత్యంత ముఖ్యమయిన రాజులు, చక్రవర్తులు ఆరుగురు ఉన్నారు అని చెప్తారు. ఆ ఆరుగురిని గురించి చెప్పే శ్లోకం కింద మీకోసం!

హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన ః

హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు.


25, ఏప్రిల్ 2020, శనివారం

పురుషుడు - అష్టపురములు

మనం సహజంగా పురుష శబ్దాన్ని మగవారి కోసం వాడతాము. కానీ మన పూర్వీకుల కధనం ప్రాకారం పురుష అనే శబ్దానికి అర్ధం అష్టపురములను ఆధారము చేసుకుని జీవనం సాగించేవారు అని అర్ధం. మరి ఇంతకీ ఆ అష్టపురములు అంటే ఏమిటి?

జ్ఞానేంద్రియాణి ఖలు పంచ తథాపరాణి కర్మేంద్రియాణి మనః ఆది చతుష్టయం చ
ప్రాణాదిపంచకమధో వియదాదికం చ కామశ్చ కర్మచ తమః పున రష్టధాపూః


భావం ః  జ్ఞానేంద్రి యాలు (ఐదు), కర్మేంద్రియాలు (ఐదు), అంతః కారణములు (నాలుగు, అవి మనస్సు ,బుద్ధి, చిత్తము మరియు అహంకారము), ప్రాణాలు (ఐదు), పంచభూతములు, కామము, కర్మ మరియు అజ్ఞానము ఈ ఎనిమిది ని కలిపి అష్టపురములు అంటారు.

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

పంచ క్లేశములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ అషట కష్టములకు మాత్రమే కాక అసలు మానవుని బాధలకు కారణమయిన ఐదు కిలేసముల గురించి చెప్పుకుందాం. ఆ పంచ క్లేశములు

  1. అవిద్యాక్లేశము : తన నిజ స్వరరూపమును గుర్తించకుండా తాని ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య క్లేశము
  2. అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట/ వదలకుండా ఉండుట అభినవ క్లేశము 
  3. అస్థిగత క్లేశము : విషయములలో అత్యంత నిమగ్నుడు అయ్యి గర్వించుట అస్థిగత క్లేశము
  4. రాగ క్లేశము : ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట రాగ క్లేశము
  5. ద్వేషక్లేశము : మన పనుల కోసం పక్కవారిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందుతూ తిరిగి వారి పైననే ద్వేషము కలిగి ఉండుట ద్వేష క్లేశము 

22, ఏప్రిల్ 2020, బుధవారం

అష్టభోగములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం!మరి ఇప్పుడు అష్టభోగములు అంటే ఏమిటో చెప్పుకుందామా! ఆ అష్టభోగముల గురించి చెప్పే శ్లోకం

దాసో భృత్యస్సుతో బంధుర్వస్తు వాహన మేవచ
ధనధాన్యసమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః 


భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.

దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.

20, ఏప్రిల్ 2020, సోమవారం

అజ్ఞాన భూమిక

అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము.  ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి  శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!


  1. బీజాగ్రము:: నామ రూప రహిత,  అఖండ  పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన  బీజాగ్రము
  2. జాగ్రము::  ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు  చెందుట జాగ్రము
  3. మహాజాగ్రము:: ప్రపంచము లో  వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
  4. జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
  5. స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
  6. స్వప్నజాగ్రము:: ఇంతకు  ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
  7. సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి




28, మార్చి 2020, శనివారం

నవ శక్తులు

శక్తులను గురించి చెప్తున్నప్పుడు మన పెద్దలు తొమ్మిది శక్తుల గురించి చెప్తారు.
ఆ తొమ్మిది శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

  1. ఇచ్ఛాశక్తి 
  2. క్రియాశక్తి 
  3. ఉత్సాహశక్తి 
  4. ప్రభుత్వశక్తి 
  5. మంత్రశక్తి 
  6. సత్వశక్తి 
  7. రజశ్శక్తి
  8. తమోశక్తి 
  9. జ్ఞానశక్తి 




26, జనవరి 2019, శనివారం

కామం - 10 వ్యసనములు

మనం ఇంతకు ముందు అరిషట్ వర్గముల గురించి చెప్పుకున్నాం! వాటిలో కామం (కోరిక) వలన జనించిన 10 వ్యసనములు గురించి మనువు తన ధర్మశాస్త్రం లొ చెప్పారు. ఆ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం!
శ్లో : మృగయాక్షా దివాస్వప్నః పరివాదః స్త్రీయో మదః
     తౌర్యత్రికం వృధాట్యా చ కామజోదశకో గణః
భావం : కామం (కోరిక) నుండి పది వ్యసనములు జనించాయి. అవి
  1. వేట
  2. వాదం
  3. పగటి నిద్ర
  4. పరనింద
  5. స్త్రీలతో కూడటం
  6. మధ్యపానం/ మత్తు పదార్ధముల సేవనం
  7. నృత్యాభిలాష
  8. సంగీతాభిలాష
  9. వృధాసంచారం
  10. అకారణం గా ఇతరులను శిక్షించటం

ఇక్కడ ఉన్న అన్ని వ్యసనములలో నృత్యం, సంగీతం మనకు ఉన్న 64 కళలలో కూడా ఉన్నయి. ఇక్కడ మనం గమనించ వలసినది, నృత్యమయినా సంగీతమయినా శాస్త్రబద్దంగా ఉంటాయి. వానిని కళాత్మక దృష్టితో మత్రమే చూడగలిగితే మంచిది, కానీ మరొక దృష్టితో చూడటమేవ్యసనం. 

7, జనవరి 2019, సోమవారం

సప్త గంగలు

మన పురాణములలో చెప్పిన అనేక విషయములలో పరమ పుణ్యమయములని నదులను చెప్తారు. అయితే మనకు ఉన్న అనేక నదులలో తలమానిక మైనది గంగా నది. అయితే ఆ గంగ కు సమాన మయినవి అని చెప్ప బడే ఏడు నదులు ఉన్నయి. వానిని సప్త గంగలు అని చెప్తారు. అవి
  1. గంగ
  2. గోదావరి
  3. కావేరి
  4. తామ్రపర్ణి
  5. సింధు
  6. సరయు
  7. నర్మద

1, జనవరి 2019, మంగళవారం

మానవుడు - ధర్మములు

మన దేశములో మానవులకు అన్నింటికంటే ముఖ్యమయిన భాద్యత ధర్మాన్ని పాటించుట అని చెప్తారు. అయితే ఆ ధర్మములు అనేక రకములు ఉన్నయి. అవి సహజంగా కొన్ని సార్లు సమయమును బట్టి మారుతూ ఉన్నప్పటికీ శాస్త్రం మానవునికి ప్రతిపాదించిన ధర్మములు ముఖ్యంగా 11.
  1. సనాతన ధర్మము
  2. సామాన్య ధర్మము
  3. విశేష ధర్మము
  4. వర్ణాశ్రమ ధర్మము
  5. స్వ ధర్మము
  6. యుగ ధర్మము
  7. మానవ ధర్మము
  8. పురుష ధర్మము
  9. స్త్రీ ధర్మము
  10. రాజ ధర్మము
  11. ప్రమిథి లేదా ప్రాపంచిక ధర్మము
 

30, డిసెంబర్ 2018, ఆదివారం

ఏకవింశతి ఉపచారములు

దేవాధిదేవుని పుజించే సమయంలో మనం ముఖ్యంగా చేసేవి 21 ఉపచారములు. వానిని ఏకవింశతి ఉపచారములు అంటాము. అవి
  1. ధ్యానం
  2. ఆవాహనం
  3. ఆసనం
  4. పాధ్యం
  5. అర్ఘ్యం
  6. ఆచమనీయం
  7. అభిషేకం
  8. వస్త్రం
  9. భస్మం
  10. గంధం
  11. అక్షతలు
  12. పుష్పములు
  13. బిల్వ పత్రములు
  14. ధూపము
  15. దీపము
  16. నైవేద్యము
  17. తాంబూలము
  18. మహానీరాజనము
  19. మంత్ర పుష్పము
  20. నమస్కారము
  21. ప్రార్ధన

18, సెప్టెంబర్ 2014, గురువారం

అష్ట దిగ్గజములు

మన పురాణముల ప్రకారం ఈ భూభారమును అష్టదిక్కులలో అష్ట గజములు (ఏనుగులు) వహిస్తూ ఉంటాయి. వాటినే అష్టదిగ్గజములు అంటాం. వాని పేర్లు

  1. ఐరావతం 
  2. పుండరీకం 
  3. వామనం 
  4. కుముదం 
  5. అంజనం 
  6. పుష్పదంతం 
  7. సార్వభౌమం 
  8. సుప్రతీకం 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

అష్ట కష్టములు

మనం సహజంగా చాలా కష్ట పడి ఏదయినా పని చేశాం అని చెప్పటానికి పర్యాయపదంగా అష్ట కష్టములు పడి ఆ పనిని సాధించాం అని చెప్తాం కదా! మరి నిజంగా అష్ట కష్టములు అంటే ఏమిటో చూద్దామా!

  1. దారిద్యం  
  2. దాస్యము 
  3. భార్యావియోగం 
  4. యాచనం 
  5. స్వయం కృతాపరాధం 
  6. అప్పు పుచ్చుకుని భాదపడుట 
  7. ప్రయత్న విఫలం 
  8. అనారోగ్యం 


14, సెప్టెంబర్ 2014, ఆదివారం

పంచ మలములు

భగవంతుని చేరే సాధనలో సాధకునికి అనేక విషయములు అడ్డంకిని కలిగిస్తాయి. వానినే మలములు అంటారు. అవి ఐదు
1. ఆణవ మలము: భగవంతుని గురింఛి తెలుసుకునే ప్రయత్నంలో ఆ జ్ఞానమును మరుగున పరచునది
2. కార్మిక మలము : గురువుగారు చెప్పే విషయములను అర్ధంచేసుకునే క్రమం లో అడ్డు వచ్చేది
3. మాయిక మలము : సర్వదా దైవ చింతనకు దూరమ్ గా ఉంచుతూ, జ్ఞాన సముపార్జన చేయకుండా చేసేది
4. మాయేయ మలము : సర్వదా పాపములు చేయుటకు ప్రోత్సహించునది
5. తిరోధాన మలము : పరమాత్మను మరిపింపచేసి, జనన, మరణములే జీవితం అని భాసింప చేసేది.


13, సెప్టెంబర్ 2014, శనివారం

ఐదు శక్తులు

మన పురాణముల ప్రకారం శక్తులు ఐదు రకములు
అవి
1. పరాశక్తి : ఆకర్షణకు కారణము - ఇది దైవిక శక్తి
2. ఆదిశక్తి : మనలోని పంచ ప్రాణములకు ఆధారము - ఇది స్వాభావికమైన శక్తి
3. జ్ఞానశక్తి : జ్ఞానమునకు కారణం, ఇంద్రియముల శక్తికి ఆధారం
4. ఇచ్ఛాశక్తి : ఆలోచనలకు, సంకల్పమునకు ఆధారం
5. క్రియా శక్తి : శారీరికమైన క్రియలకు ఇది ఆధారం.


12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పంచ కర్మేంద్రియములు

మానవుడు తన నిత్య జీవనములో పనులు చేసుకొనుటకు ఉపయోగపడే శరీరభాగములు ఐదు. అవి

1. కాళ్ళు
2. చేతులు
3. నోరు
4. ఉపస్థ
5. పాయువు