ఆయుధాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆయుధాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2020, మంగళవారం

పినాకం - శివుని విల్లు

శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
 ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.

5, జులై 2014, శనివారం

కౌమోదకి

శ్రీ మహావిష్ణువు గధ : కౌమోదకి 


శ్రీ మహావిష్ణువు తన ఎడమ కింది చేతిలో గధను ధరించి ఉంటారు. ఈ గధ  స్వామివారికి ఎలా చేరిందో తెలియ చెప్పే వివిధ ఘట్టాలు మనకు కనిపిస్తాయి. 

1. గధ అనే పేరు ఎలా వచ్చింది?

పూర్వం గధ అనే ఒక రాక్షసుడు ఉండే వాడు. అతడు దైవ, మానవుల కు భయం కలిగిస్తూ ఉండే వాడు. ఐతే అతనిలో కల మంచి సుగుణం సత్యవాక్య పరిపాలన. తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా వెంటనే ఇచ్చే వాడు. 

దేవ, మానవుల కష్టాలు గమనించిన ఆ శ్రీ మహా విష్ణువు గధ వద్దకు వెళ్లి తన ఎముకలు కావలసినది గా కోరారు. అప్పుడు ఆ గధ తన ఎముకలు తానే విరచి ఆ శ్రీమహావిష్ణువు చేతిలో పెట్టారు. ఆ ఎముకలను తీసుకున్న విష్ణువు పరమ దయతో ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో నే ఉంచుకున్నరు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ఎముకలకు ప్రసాదించిన ఆకారాన్ని మనం ఈ నాటికీ గధ అనే పిలుస్తున్నాం. 

ఒక వ్యక్తి  ఎంత రాక్షసుడైన తనలో ఉన్న ఏదో ఒక చిన్న మంచి తనం తో, చేసిన త్యాగం తో అంతకు ఎన్నో రెట్ల భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. 

2. కౌమోదకి శ్రీ కృష్ణునికి ఎవరు ఇచారు ? ఎందుకు?

శ్రీకృష్ణునికి కౌమోదకి ని అగ్ని దేవుడు ఖాండవ వన దహన సమయం లో ఇచ్చాడు.

18, జూన్ 2014, బుధవారం

ఆయుధాలు, ఆభరణాలు

మన భగవవంతుని వర్ణన లో చాలా ముఖ్య మైనవి ఆ మూర్తి యొక్క ఆయుధాలు, ఆభరణాలు. ఈ శీర్శిక లో వారి వారి ఆయుధాలు, ఆభరణాలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.


  1. మహావిష్ణువు 
  2. మహాదేవుడు 
  3. దుర్గమ్మ 
  4. సరస్వతి 
  5. గాయత్రి 
  6. కుమార స్వామి 
  7. వినాయకుడు