సమయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2015, బుధవారం

నక్షత్రములు - అధిపతులు

మనం ఇంతకు ముందు నక్షత్రములు 27 అనీ, వారు దక్షుని పుత్రికలు అనీ వారిపేర్లు కుడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ నక్షత్రముల అధిపతుల గురించి తెలుసుకుందాం.
  1. అశ్విని  కి అధిపతి అశ్వినీ దేవతలు 
  2. భరిణి కి అధిపతి యముడు 
  3. కృత్తిక కి అధిపతి అగ్ని 
  4. రోహిణి కి అధిపతి బ్రహ్మ 
  5. మృగశిర కి అధిపతి చంద్రుడు 
  6. ఆరుద్ర కి అధిపతి శివుడు 
  7. పునర్వసు కి అధిపతి  అదితి 
  8. పుష్యమి కి అధిపతి గురుడు 
  9. ఆశ్లేష కి అధిపతులు సర్పములు 
  10. మాఘ/ మఖ కి అధిపతులు పితృ దేవతలు   
  11. పూర్వ ఫల్గుని కి అధిపతి భగుడు అనే సూర్యుడు
  12. ఉత్తర ఫల్గుణి కి అధిపతి అర్యముడు అనే సూర్యుడు
  13. హస్త కి అధిపతి సూర్యుడు 
  14. చిత్త కి అధిపతి  ఇంద్రుడు 
  15. స్వాతి కి అధిపతి వాయువు 
  16. విశాఖ కి అధిపతులు ఇంద్రుడు మరియు అగ్ని 
  17. అనురాధ కి అధిపతి మిత్రుడు అనే సూర్యుడు 
  18. జ్యేష్ట కి అధిపతి ఇంద్రుడు 
  19. మూలా కి అధిపతి రాక్షసుడు 
  20. పుర్వాషాడ కి అధిపతి వరుణుడు 
  21. ఉత్తరాషాడ కి అధిపతులు విశ్వేదేవతలు 
  22. శ్రవణ కి అధిపతి విష్ణువు 
  23. ధనిష్ఠ కి అధిపతులు అష్టవసువులు 
  24. శతభిష కి అధిపతి వరుణుడు 
  25. పూర్వాభాద్ర కి అధిపతి కజచరణుడు 
  26. ఉత్తరాభాద్ర కి అధిపతి ఆహిర్భుద్న్యు డు 
  27. రేవతి కి అధిపతి పూషుడు అనే సూర్యుడు 

17, సెప్టెంబర్ 2014, బుధవారం

కల్పం

మనకు కాలం లెక్కింపు నిముషములు, రోజులు, వారములు మరియు నెలల రూపంలో చేస్తాం కదా! ఇంతకూ ముందు మనం మనువులు, యుగములు గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు బ్రహ్మగారి సమయము గురించి తెలుసుకుందామా!
బ్రహ్మదేవుని ఒక్కరోజులో 14 మన్వంతరములు జరుగుతాయి. బ్రహ్మదేవుని ఒక్క రోజును కల్పం అంటారు. అంటే
కల్పం = 14 మన్వంతరములు
ఇటువంటి కల్పములు 30 ఐతే బ్రహ్మగారికి ఒక నెల. నెలలోని ఆ 30 రోజులకు పేర్లు మస్త్య పురాణంలో చెప్పబడ్డాయి.
అవి

  1. శ్వేత 
  2. నీలలోహిత 
  3. వామదేవ 
  4. రత్నాంతర 
  5. రౌరవ 
  6. దేవ
  7. బృహద్ 
  8. కందర్ప 
  9. సద్యః 
  10. ఈశాన 
  11. తమో 
  12. సారస్వత 
  13. ఉదాన 
  14. గరుడ 
  15. కౌర 
  16. నారసింహ 
  17. సమాన 
  18. ఆగ్నేయ 
  19. సోమ 
  20. మానవ 
  21. తత్సుమాన 
  22. వైకుంఠ 
  23. లక్ష్మి 
  24. సావిత్రి 
  25. అఘోర 
  26. వరాహ 
  27. వైరాజ 
  28. గౌరి 
  29. మహేశ్వర 
  30. పితృ 
ఇవే కాక అనేకములయిన కలపముల పేర్లు చెప్పబడి యున్నాయి.
To read the same in english click here.


10, సెప్టెంబర్ 2014, బుధవారం

ద్వాదశ సూర్యులు వారి నెలలు , అనుచరులు


మనకు ప్రతి నెలలో ఉండే సూర్యుడు ఒక్కో రకమైన తేజస్సుతో ఉంటాడు కనుక మంకు గల 12 నెలల్లోని 12 సూర్య తెజన్ను ను ఆధారంగా, వాని తీవ్రతల, ప్రభావాల ఆధారంగా వానిని 12మంది సూర్యులుగా భావించి వారి అనుచరులను కూడా విభాగం చేసారు. ఒక్కో సూర్యునికి ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు, ఒక అప్సరస, ఒక ముని మరియు ఒక నాగు లు అనుచరులుగా ఉంటారు.    
             
   
మాసము
సూర్యుడు
ముని
యక్షుడు
గంధర్వుడు
అప్సరస
రాక్షసుడు
నాగ
1
చైత్రం
దాత
పులస్య
రధక్రుత్
తుంబురుడు
కృతస్థలి
హేతి
వాసుకి
2
వైశాఖ
అర్యమ
పులః
అధోజ
నారదుడు
పుంజక స్థలి
ప్రహేతి
కఛనీర
3
జ్యేష్ట
మిత్ర
అత్రి
రధస్వన
హహ
మేనక
పౌరుషేయ
తక్షకుడు
4
ఆషాడ
వరుణ
వసిష్ఠ
చిత్రస్వన
హుహు
రంభ
సహజన్య
శుక్ర
5
శ్రావణ
ఇంద్ర
అంగీరస
శ్రోత
విశ్వవసు
ప్రమ్లోచ
వర్యుడు
ఏలాత పత్ర
6
భాద్రపద
వివస్వ
భృగు
ఆసారణ
ఉగ్రసేన
అనుమ్లోచ
వ్యాగ్ర
శంఖపాల
7
ఆశ్వయుజ
పూష
గౌతమ
సురుచి
సుసేన
ఘృతాచి
వాత
ధనుంజయ
8
కార్తిక
పర్జన్య
భరద్వాజ
రితు
విశ్వ
సేనజిత్
వర్కా
ఐరావత
9
మార్గశిర
అంషుమాన్
కశ్యపుడు
తర్క్స్య
రుతసేన
ఊర్వసి
విధ్యుత్ చత్రు
మహాసంఖ
10
పుష్యం
భగ
అయు:
ఊర్ణ
అరిష్టనేమి
పుర్వచిత్తి
స్పూర్జ
కర్కోటక
11
మాఘం
త్వష్ట
జమదగ్ని
సతాజిత్
ధృతరాష్ట్ర
తిలోత్తమ
బ్రాహ్మాపేత
కంబళా
12
ఫాల్గుణ
విష్ణు
విశ్వామిత్ర
సత్యజిత్
సుర్యావర్క
రంభ
మఖాపేత
అశ్వతర

మనకు గల 12 మంది సూర్యుల ఉహా చిత్రములు

1. దాత 

2. అర్యమ 


3. మిత్ర 

4. వరుణ 

5. ఇంద్ర 

6. వివస్వ 

7. పూష 

8. పర్జన్య 

9. అంషుమాన్ 

10. భగ 

11. త్వష్ట 


12 విష్ణు 







7, సెప్టెంబర్ 2014, ఆదివారం

స్వరోచి - స్వారోచిషుడు

స్వరోచి, ప్రవరాఖ్యుని మనస్సునందు తలుచుకొంటూ మాయా ప్రవరుని రూపంలో గల కలి అనే గంధర్వుని వల్ల వరూధినికి జన్మించిన వాడు. అతను పుట్టుకతోనే అత్యంత శరీర తేజస్సుతో జన్మించాడు. శుక్లపక్ష చంద్రుని వలే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాడు. అతను యుక్త వయస్సుకు వచ్చే సమయమునకు సర్వ సద్గుణములు అలవడ్డాయి. వేద, వేదాంగాలు పట్టుబడ్డాయి. సర్వ ఆయుధముల గురించిన విద్యను తెలుసుకున్నాడు. 
ఒకనాడు మంధర పర్వత ప్రాంతం లో తిరుగుతూ ఉండగా ఒక కన్య సహాయంకోసం అరవటం విని అక్కడకు మనోరమ ను రాక్షసుని బారి నుండి కాపాడి,  మనోరమ తండ్రి అయిన ఇందీవరాక్షుడి కి శాపవిమోచనం కలిగించి,  ఇందీవరాక్షుని వద్ద ఉన్న ఆయుర్వేద విద్యను స్వీకరించి, మనోరమతో పాటు శాపగ్రస్తులైన తన స్నేహితురాళ్ళు కళావతి, విభావరిలకు ఆయుర్వేద విద్యద్వారా వారికి గల కుష్టురోగము నుండి విముక్తి కలిగించి, వారి వద్ద నుండి పద్మిని విద్యను,సర్వప్రాణుల భాషలను తెలుసుకొనగలిగిన విద్యను పొందిఇందీవరాక్షుని సమక్షంలో వారు ముగ్గురిని వివాహం చేసుకుని వారితో ఆనందంగా గడప సాగాడు. 
ఒకనాడు స్వరోచి,అతని భార్యల అన్యోన్యత గురించి ఒక కలహంస తన స్నేహితురలయిన చక్రవాకమునకు చెప్పుట స్వరోచి విన్నాడు. 
కలహంస: జగతిలో ఎందరో భార్యాభర్తలు ఉండవచ్చు కానీ వారు ఒకరికి ఇంకొకరు సరి ఐనవారు అయిఉండరు. ఒకరికి మరొకరి పైగల ప్రేమ సమానంగా ఉండదు. కానీ స్వరోచి, అతని ముగ్గురు భార్యలు అందంలో, ప్రేమలో ఒకరికి మరొకరు ఏ మాత్రం తక్కువ కాదు 
చక్రవాకం: స్వరోచి గురించి అంత గొప్పగా చెప్పుకోనుతకు ఏమి లేదు. అతను భార్యలను విద్యను ప్రాప్తించుకొనుటకు మాత్రమే వివాహం చేసుకున్నాడు. ఒక భార్యతో ఉండగా మరొక భార్య గురించి ఆలోచిస్తాడు. 
వీరి మాటలు విన్న స్వరోచికి ఎంతో అవమానంగా అనిపించినది. వారు చెప్పిన మాటలు నిజములు. అలా  కాలం 100 సంవత్సరములు గడచి పోయినది. 
ఒకనాడు స్వరోచి అరణ్యములలో కొన్ని కస్తూరి మృగములను చూసాడు. మగ కస్తూరి మృగం కస్తూరి వాసనను ఒక ఆడ మృగం చూస్తూ ఉన్నది. అది గమనించిన మగ మృగం ఆడమృగం తో " నేను స్వరోచి వంటి వాడిని కాదు, నా భార్యను కనుల ముందు ఉంచుకుని మరొక భార్య గురించి ఆలోచించుటకు, ఒక స్త్రీకి అనేక పురుషులతో సంబంధం ఉంటే ఏ విధంగా ఆమె దారి తప్పినది అంటారో ఒక పురుషుని మనస్సులో అనేక మంది భార్యలు ఉంటే అతనిని కూడా దారి తప్పినా వాని గానే చెప్తారు. నీను నిన్ను దగ్గరకు రానివ్వటానికి నేను ఏమి స్వరోచిని కాను. నీవు దూరంగా వెళ్ళు" అన్నది. ఈ మాటలు విన్న స్వరోచికి వైరాగ్యం వచ్చినట్లు అనిపించసాగినది. కాని ఇంటికి వెళ్లి వారిని చూడగానే మరలా నిత్యనుస్టానము, సర్వ కార్యములు యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. 
స్వరోచికి ముగ్గురు భార్యల యందు ముగ్గురు పుత్రులు కలిగారు. 
మనోరమకు విజయుడు, విభావారికి మేరునందనుడు మరియు కళావతికి ప్రభవుడు. స్వరోచి తనకు గల పద్మిని విద్య ద్వారా వారు ముగ్గురి కోసం మూడు నగరములను నిర్మించాడు. తూర్పున కామపుర అనే పర్వతం మీద విజయుని క్కోసం విజయ అనే నగరం, ఉత్తరమున మేరునందుని కోసం నందవతి అనే నగరం, దక్షిణ దిక్కున తల అనే నగరమును ప్రభవునకు నిర్మించి ఇచ్చాడు. 
ఇలా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు స్వరోచి అరణ్యములలో తిరుగుతూ ఉండగా ఒక ఎలుగుబంటి ని చూసి, తన బాణమును బయటకు తీసాడు. కాని ఆ ఎలుగుబంటి కనిపించకుండా పారిపోయినది. అప్పుడు ఒక జింక అతనివద్దకు వచ్చి, తనమీద బాణ ప్రయోగం చేయవలసినది అని అడిగినది. దానికి స్వరోచి, నీకు శరీరంలో ఏమీ అనారోగ్యం ఉన్నట్లు కనిపించుట లేదు, నీకు ఈ విధంగా మరనిమ్చావలెను అనే కోరిక ఎందుకు కలిగినది? అని అడిగాడు. 
జింక : నేను ఒక మానవుని వలచాను కాని అతనికి అతని భార్య పై అమిత మైన ప్రేమ కలదు. మరి నేను బ్రతికి ఉండుట వ్యర్ధం కదా! అందుకనే నన్ను వధించు 
స్వరోచి : ఓ అందమైన జింకా! నీవు ఒక మానవుని ఎలా వరించావు? నీవు మృగానివి. ఇది ఎలా సాధ్యం?
జింక: నేను నిన్నే వారించాను స్వరోచి. అది అసంభవం అని నాకు కూడా తెలుసు కనుకనే నన్ను వధింపమని నిన్నే కోరుకున్నాను 
స్వరోచి: నీవు నన్ను వలచినట్లయితే నేను నిన్ను చంపలేను. కనుక నేను ఎప్పుడు ఏమి చేయాలో చెప్పవలసినది. 
జింక : ఓ స్వరోచి! నీవు ఒకాసారి నన్ను ప్రేమగా దగ్గరకు చేర్చుకో! 
అప్పుడు స్వరోచి ఆ జింకను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు ఆ జింక ఒక అందమైన స్త్రీ రూపును ధరించినది. 
ఆశ్చర్య పోయిన స్వరోచి ఆమె ను నీవు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆమె తను వనదేవతను అని చెప్పినది. కాలంలో రెండవ మనువు జన్మకు కారణం కావలసినది అని దేవతలు తనను ప్రార్ధించగా జింక రూపం లో వచ్చాను అని చెప్పినది. ఆ కలయిక వల్ల  వారికి ఒకపుత్రుడు జన్మించాడు. అత్యంత రమణీయమైన రూపంతో, సర్వశక్తులతో జన్మించిన ఆ బాలునికి ధ్యుతిమంతుడు అని పేరు పెట్టారు. స్వరోచి పుత్రుడు కనుక స్వారోచిషుడు అని కుడా అన్నారు. 
తరువాత స్వరోచి ఒక జలాశయం దగ్గరకు వెళ్లి నప్పుడు రెండు బాతులు వైరాగ్యమును గురించి మాట్లాడుకొనుట విన్న తరువాత అతనికి వైరాగ్యం కలిగి తనభార్యలను పుత్రులకు అప్పగించి, అరణ్యమునకు వెళ్లి తపస్సు చేయుట ప్రారంభించాడు. 

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వరూధిని

వరూధిని మౌల అనే గంధర్వుని కుమార్తె. ఏంతో సుందరమైన అప్సరస. ఆమెకు గంధర్వలోకం కన్నా హిమాలయ పర్వతప్రాంతం అంటే ఎంతో మక్కువ. అందుకనే ఆమె సర్వదా హిమాలయ పర్వత ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది.
ఒకరోజు ఆమె వద్దకు తను ఇంటికి వెళ్ళే మార్గం చెప్పవాసినది అని ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి అడిగాడు. అతనే ప్రవరాఖ్యుడు. అతని దివ్యసుందర రూపం చుసిన వరూధిని మరుక్షణం అతనిని వరించినది. అప్పటి వరకు ఆమెను వివాహం చేసుకుంటాం అనే ప్రస్తావనతో నాగ, సిద్ధ, గంధర్వ, దేవతలు, అసురులు ఆమెను అడిగారు. కానీ  ఆమె మనస్సు ఎవరినీ వరించలేదు. కాని మొదటిసారి ఒక బ్రాహ్మణ యువకుని ఆమె వరించినది.
ప్రవరాఖ్యుడు తాను  తన స్వగృహమునకు వెళ్ళే మార్గం చెప్పమని అడుగగా, ఆమె అతనిని వరించినది అని చెప్పినది. ఆమె తన హృదయవేదనను అతనిని అర్ధం చేసుకుని ఆమెను వరించి, ఆమె ప్రాణములు నిలుపవలసినది అని ప్రార్ధించినది. ప్రవరాఖ్యుడు అతని నిత్య విధులకు ఆలస్యం అవుతుంది కనుక త్వరగా ఇంటికి వెళ్ళే సంకల్పంలో ఉన్నాడు కనుక ఆమె అతనిని కనీసం ఒక్కసారి ఆమె భాదను తొలగించమని ప్రార్ధించినది. కానీ ప్రవరాఖ్యుడు అమిత నిష్టాగరిష్టుడు. అతను తన నిష్టను వదులుకొనుటకు ఇష్టపడకుండా అగ్ని దేవుని సహకారం తో ఇంటికి వెళ్లి పోయాడు.
కానీ వరూధిని విరహ తాపంతో రోదిస్తూ ఉండిపొయినది. ఆమె శోకమును ఆమెను నిరంతరం ప్రేమిస్తూ, అమెచేత అనేకసార్లు తిరస్కరించబడిన కలి అనే ఒక గంధర్వుడు చూసాడు. వరూధిని శోకం అతనిని మరింత భాదించినది. ఆమె శోక కారణం తెలుసుకుని ఆమెను అనునయించాలి అని భావించాడు. అతనికి గల దివ్యదృష్టి ద్వారా జరిగిన విష్యం తెలుసుకున్నాడు. అతనిముందు రెండు మార్గములు ఉన్నాయి ఆమె విచారమును దూరం చేయుటకు.
  1. బ్రాహ్మణ యువకుని తిరిగి వరూధిని వద్దకు తీసుకు రావటం 
  2. తనే స్వయంగా బ్రాహ్మణ రూపం లో ఆమెకు చేరువ అగుట 
బ్రాహ్మణ యువకుడు ఆమె ప్రతిపాదనను ఒప్పుకునే వాడయితే తిరిగి ఇంటికి వెళ్ళేవాడే కాదు. కనుక రెండోవ మార్గమే సరి ఐనది అని భావించి ఆ యువకుని రూపంలో వరూధిని వద్దకు వెళ్ళాడు. 
మాయా ప్రవరాఖ్యుని చూసిన వరూధిని శోకంనుండి తేరుకున్నది. సంతోషించినది. ఐతే వారి సంగమమునకు మాయా ప్రవరుడు ఒక నిబంధన ఉంచాడు. వారి సంగమ సమయంలో వరూధిని కన్నులు ముసుకోవాలి అని. 
ప్రవరుని చూసిన, ఆటను తిరిగి తనవద్దకు వచ్చిన సంతోషంలో ఆమె ఆ నిబంధనను ఒప్పుకున్నది. 
వారి సంగమ సమయంలో ఆమె తన కన్నులు మూసుకుని ప్రవరుని గురించి అలోచించ సాగినది. వరూధిని గర్భందాల్చినది. 
ప్రవరుని ఆలోచనలు, గంధర్వుని సంగమం వల్ల జన్మించిన ఆ బాలుడు దివ్య తేజస్సు తో జన్మించాడు. అందువల్ల అతనికి స్వరోచి అని నామకరణం చేసారు. 

కాలాంతరంలో ఈ స్వరోచి కళావతి, విభావరి మరియు మనోరమ లను వివాహం చేసుకుని రెండోవ మనువయిన స్వారోచిష అనే మనువు జన్మకు కారణం అయినాడు. 

4, సెప్టెంబర్ 2014, గురువారం

ప్రవరాఖ్యుడు

ప్రవరాఖ్యుడు బ్రాహ్మణుడు. సర్వసద్గుణ వంతుడు. అందంలో ఆశ్వినిదేవతల తో సమానమైన వాడు. తల్లితండ్రులకు సేవచేయటంలో ఉత్తముడు. భార్యాబిడ్డలకు ప్రేమానురాగాములు పంచుటలో మేటి. నిరంతరం అతిధులకు ఆతిధ్యం ఇస్తూ, వారి ప్రయాణ విషయముల గురించి, వారు దర్శించిన స్థలముల గురించి వివరములు తెలుసుకొనుట అతని దినచర్యగా ఉన్నది. ఇలా చిన్నప్పటినుండి తన స్వగ్రామము వదలి వెళ్ళని ప్రవరాఖ్యునికి అనేక దేశములను చూసిన వారి అనుభవములను విని విని తనకు కూడా ఇతర ప్రదేశములను చూడాలన్న కోరిక కలిగినది.
ఒకనాడు రాత్రివేళ వారి ఇంటికి ఒక యువఅతిధి వచ్చాడు. అతనికి ఆతిధ్యం ఇస్తున్న వేళ ఆ అతిధి చూసివచ్చిన ప్రదేశముల గురించి ప్రవరాఖ్యునకు చెప్తూ ఉన్నాడు. అనేక దేశములు, వివిధ వింతలు, విశేషాలు, అధ్బుతములు ఎన్నో మరెన్నో. అన్నీ  వింటున్న ప్రవరాఖ్యునకు ఈ అతిధి అన్ని ప్రదేశములు ఏవిధంగా సంచరించాడో అర్ధంకాలేదు. ఆటను చూస్తే యువకుడు, అన్ని ప్రదేశములు తిరిగి రావాలంటే అతని వయస్సు సరిపోదు. మరి ఎలా ఇతను అన్ని ప్రదేశములను చుట్టి రాగలిగాడు? అదే సందేహం ఆ అతిధిని అత్యంత ఉత్య్సుకతతో అడిగాడు.
దానికి ఆ యువ సిద్ధుడు తనకు అనేక దివ్య ఔషదముల గురించి, దివ్య లేపనముల గురించి తెలుసనీ, తనవద్ద ఒక దివ్యమైన పాదలేపనము ఉన్నది అని ఆ లేపనము పాదములకు పెట్టుకుని అనేక యోజనముల దూరం కేవలం ఒక్క పూటలో వెళ్ళ వచ్చు అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రవరాఖ్యుడు తనకు ఆ లేపనము ఇస్తే తనకు సర్వదా కల ఇతరదేశములను దర్శించాలన్న కోరికను తీర్చుకోగలను అని అడిగాడు. ఆ సిద్ధుడు ప్రవరాఖ్యునకు కొంత లేపనమును ఇచ్చాడు. తనకు లభించిన ఈ అవకాశమును ఉపయోగించ దలచుకున్నాడు.
ఉదయాన్నే నిత్యకృత్యములను పూర్తిచేసుకుని ఆ లేపనమును తన పాదములకు వ్రాసుకుని ప్రవరాఖ్యుడు హిమాలయప్రాంతమునకు చేరుకున్నాడు.  
ఆ హిమాలయప్రాంత అందములను చూస్తూ, వాటిని గమనిస్తూ అటూ ఇటూ ఆ హిమపర్వతం మీద పరుగులు తీస్తూ, తన పాదములకు ఉన్న లేపనం మంచులో కరిగిపోతుండగా గమనించలేక పోయాడు. మధ్యాహ్న సమయం అవ్వటం గమనించి తిరిగి తన ఇంటికి చేరుకోవాలి అనే కోరికతో, వేగంగా నడవటానికి ప్రయత్నించగా అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు తన పాదలేపనము లేకపోవుట గమనించి, పరి పరి విధములా భాదపడ్డాడు. తనను తానూ నిందించుకున్నాడు.
ఆ సమయంలో ప్రక్కనే ఎవరో గానం చేస్తున్న సవ్వడి వినిపించినది. అక్కడ ఎవరైనా ఉంటే తను తన స్వగృహమునకు వెళ్ళేందుకు సహాయం చేస్తారు అని సంతోషించాడు.
అక్కడకు వెళ్లి చూడగా అక్కడ ఒక గంధర్వ కాంత ఉన్నది. ఆమె, వరూధిని, ప్రవరాఖ్యుని చూసిన మరుక్షణం అతనిని మోహించినది. కాని ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఉన్న ప్రవరాఖ్యుడు ఆమెను తన ఇంటికి వెళ్ళే మార్గం చెప్పమని అడిగాడు. దానికి ఆమె అతనిని తాను వలచానని, వారిరువురూ ఈ హిమాలయములలో సుఖంగా జీవనం సాగించవచ్చును  అని ప్రతిపాదించినది.
ఆ ప్రస్తావన నచ్చని ప్రవరాఖ్యుడు ఆమెకు నచాచేప్పాలని ప్రయత్నించాడు. కానీ  ఆమె వినే పరిస్థితిలో లేదని తెలుసుకుని, తాను నిత్యం పూజించే గార్హపత్యాగ్నిని ప్రార్ధించి తనను తన గృహమునకు చేర్చమని వేడుకున్నాడు.
అప్పుడు గార్హపత్యాగ్ని ప్రవరాఖ్యుని తన గృహమునకు చేర్చాడు.
ఈ సంఘటన వల్ల ఒక మనువు, స్వారోచిషుని జననమునకు బీజం పడినది.  

మనోరమ

మనోరమ మరుధన్వ మరియు విద్యాధర ఇందీవరాక్షుని పుత్రిక. ఈమెకు సర్వ ఆయుధములగురించిన, అస్త్రముల జ్ఞానము ఉన్నది. అన్నిటికి మించి హృదయజ్ఞానము తన తండ్రి నుండి లబించినది.
హృదయజ్ఞానము మొదట మహాదేవుడయిన శివుడు స్వయంగా స్వయంభుమనువునకు ఉపదేశించారు. తరువాత స్వయంభుమనువు సిద్దులలో ఉత్తముడయిన వానికి ఆ విద్యను ఉపదేశించారు. ఆ సిద్ధుడు చిత్రాయుధునకు ఉపదేశించాడు. తరువాత చిత్రాయుధుడు తన కుమార్తె కన్యాదాన సమయంలో అల్లుడయిన విద్యాధర ఇందీవరాక్షునికి ఉపదేశించారు. విద్యాధర ఇందీవరాక్షుడు తన పుత్రిక మనోరమకు చిన్నతనంలోనే ఉపదేశించారు.
ఒకసారి ఈమె తన చెలులైన కళావతి, విభావరి లతో కలిసి కైలాస పర్వతమునకు బయలుదేరినది. వారికి మార్గమధ్యంలో తపస్సులో మునిగి ఉన్న, శరీరం శుష్కించి ఉన్న ఒక ముని కనిపించాడు. వారు ఆ మునిని చూసి తన నవ్వును నిగ్రహించుకోలేక పోయారు. వారి నవ్వు వల్ల తపోభంగం కలిగిన ఆ ముని మనోరమను చూసి ఆమెను ఒన బ్రహ్మరాక్షసుడు తరుముతాడు అని శపించాడు. మనోరమ ప్రక్కనే ఉన్న కళావతి, విభావరి లకు కుష్టురోగము కలుగు గాక అని శపించాడు.
ముని శాపం అతని నోటినుండి వెలువడిన మరుక్షణం మనోరమను ఒక బ్రహ్మరాక్షసుడు తరుముతూ వచ్చారు. కళావతి, విభావరి లకు కుష్టురోగము వచ్చినది.
మనోరమ తనను తానూ కాపాడుకొనే ప్రయత్నంలో దిక్కులకు పరుగులు పెట్టసాగినది. అలా మూడు రోజుల నిరంతర ప్రయాణం తరువాత మంధర పర్వత ప్రాంతంలో పరుగెడుతున్న సమయంలో ఆమె స్వరోచిని తనను కాపాడవలసినదిగా ప్రార్ధించినది. ఆ సమయంలో స్వరోచి వద్ద ఏవిధమైన ఆయుధములు లేవు, ఆ విషయం గమనించిన మనోరమ తనవద్ద ఉన్న అస్త్ర జ్ఞానమును స్వరోచికి అందించినది. ఆ అస్త్రముల సహాయంచేత స్వరోచి మనోరమను తరుముతూ వచ్చిన బ్రహ్మరాక్షసుని మీద యుధానికి సంసిద్దుడయాడు.
బ్రహ్మరాక్షసుని మీద మొదటి అస్త్రం ప్రయోగించగానే ఆ బ్రహ్మరాక్షసుడు సుందరరూపం తో కనిపించాడు. అతనే మనోరమ తండ్రి  ఇందీవరాక్షుడు.
ఇందీవరాక్షుడు బ్రహ్మమిత్ర అనే ఒకమునివద్ద ఉన్న ఆయుర్వేద విద్యను తస్కరించుటకు ప్రయత్నించుట వల్ల అతని దుశ్చర్య కు కోపించిన బ్రహ్మమిత్ర ముని ఇందీవరాక్షుని బ్రహ్మరాక్షసునిగా మారమని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్ధించగా బ్రహ్మరాక్షసునిగా ఉన్నప్పుడు తన కుమార్తెను తినాలని ప్రయత్నించినప్పుడు ఒక వీరుని చేతిలో శాపవిమోచనం కలుగుతుంది, దొంగతనంగా పాప్తించుకున్న ఆయుర్వేద విద్యను అతనికి ఉపదేశించమని చెప్పారు.
ఇందీవరాక్షుడు ఆయుర్వేద విద్యను స్వరోచికి ఉపదేశించారు. అప్పుడు మనోరమ శాపకారణంగా అస్వస్థత చెందిన తన స్నేహితులను ఈ ఆయుర్వేద విద్య ద్వారా నయం చేయమని కోరినది. స్వరోచి వారిరువురికీ స్వస్థత చేకూర్చారు.
అప్పుడు కళావతి తన వద్ద ఉన్న పద్మిని విద్యను భోదించినది.
విభావరి తనవద్ద ఉన్న సర్వ జీవుల భాషలను అర్ధంచేసుకోగలిగిన జ్ఞానమును భోదించినది.
మనోరమ, కళావతి మరియు విభావరిలను స్వరోచి వివాహం చేసుకున్నాడు. 

3, సెప్టెంబర్ 2014, బుధవారం

కళావతి

 కళావతి, ఈమె గురించి మనకు ఎక్కువ తెలియదు. ఈమె కూడా శకుంతల వలే తల్లి తండ్రులవల్ల అరణ్యం లో విడువ బడినది. ఐతే ఎందుకు? ఆమె గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

పూర్వకాలంలో పర అనే పేరుకలిగిన ఒక బ్రహ్మర్షి ఉండేవాడు. అతను చిన్నపటినుండి బ్రహ్మచార దీక్షలో ఉన్నాడు. అతను సర్వగుణ సంపన్నుడు. వేదములు,వేదాంగములు అవుపాసన పట్టినవాడు. చైత్రమాసం, కోకిలలు కూయుచున్న వేళ అతను ఉన్న ఆ ప్రదేశానికి పుంజికస్థల అనే ఒక అప్సరస వచ్చినది. ఆమెను చూడగానే పర బ్రహ్మర్షి మనసు మన్మధ తాపమునకు లోనయినది. వారి సంగమము వల్ల వారికి ఒక పుత్రిక జన్మించినది. పుత్రిక జన్మించగానే వారికి కలిగిన మోహపు తెరలు విడిపోయాయి. అప్సరస తన స్వస్థానానికి వెళ్ళిపోయినది, బ్రహ్మర్షి కూడా తన తపస్సు కొరకు ఆ పసిపిల్లను అడవిలో వదిలి వెళ్లి పోయాడు. అడవిలో అనేక క్రూరమృగముల మధ్య ఆ బాలిక కేవలం చంద్రుని అమృత ధారలను పానం చేస్తూ పెరిగినది. కనుకనే ఆమెను కళావతి అని పిలిచారు. ఎవరో ఒక మహాత్ముడు ఆమెను చేరదీసి పెంచాడు.
ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన అలీన అనే ఒక అందమైన, దేవతలకు విరుద్ధంగా ఉండే ఒక గంధర్వుడు ఆమెను వివాహంచేసుకుంటాను అని ఆమె తండ్రి వద్దకు వచ్చి అడిగాడు. ఐతే ఆ తండ్రి ఆమెను ఆ గంధర్వునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు.  తన ప్రస్తావనను నిరాకరించిన ఆమె తండ్రి మీద ఆ గంధర్వునికి విపరీతమైన కోపంవచ్చినది. వెంటనే గంధర్వుడు ఆమె తండ్రిని సంహరించాడు.
తన తండ్రి మరణానికి తానే కారణం అని భావించిన కళావతి ఆత్మహత్యా ప్రయత్నం చేసినది. ఆ సమయంలో ఆమెను ఒక దివ్య శక్తి అడ్డుకున్నది. ఆమే భవుని భార్య సతీదేవి. సతీదేవి కళావతిని అనునయించినది, ఆమెకు భవిష్యత్తు గురించి చెప్పినది.
"ఓ ప్రియ కళావతి! నీవు ఎంతో సుందరమైన దానివి. నీకు ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన భవిష్యత్తు ఉన్నది. మునుముందు నీవు స్వరోచి అనే ఒక ఉత్తముని వివాహం చేసుకోవలసి ఉన్నది. అతనే స్వారోచిషుడు అనే మనువునకు తండ్రి కాగలిగిన వాడు. అతనికి నీ నుండి ఎంతో సహాయం జ్ఞాన రూపంలో అందవలసి ఉన్నది. లోక రక్షణార్ధమై నీవు ఈ పని చేయవలసి ఉన్నది కనుక స్వయంగా జ్ఞాన స్వరూపుడైన శివుని అర్ధంగిని, సతీ దేవిని అయిన నేను నీకు స్వయంగా పద్మిని విద్యను బోధిస్తాను. ఈ విద్య ద్వారా సర్వదేవతలు ఉన్నత గతిని పొందుతున్నారు." అని పద్మిని విద్యను కళావతికి భోదించినది.
కాలాంతరంలో కళావతి, విభావరి తో కలిసి మనోరమ అనే ఒక గంధర్వకాంతకు చెలికత్తెగా ఉన్నారు. వారు ముగ్గురూ స్వరోచిని వివాహంచేసుకున్నారు.
మనకు గల మనువులలో రెండొవవాడు ఐన స్వారోచిష మనువు,  జననమునకు కావలసిన సర్వగుణములు అతనికి చేరేలా రంగం సిద్ధం అయినది. 

19, ఆగస్టు 2014, మంగళవారం

చిరంజీవులు

మన పురాణాల ప్రకారం మనకు ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారికి మృత్యువు లేదు.

వారిని ప్రతి పుట్టినరోజు నాడు తలుచుకోవాలి. ఈ క్రింది శ్లోకం సంస్కృతం లో ఉంది.
अश्वत्थामाबलिर्व्यासोहनुमांश्च विभीषण:कृपश्चपरशुरामश्च सप्तैतेचिरंजीविन:।

అశ్వద్ధామబలివ్యాసోహనుమాంశ్చవిభీషణః కృపర్ పరుశురామశ్చ సప్తయితే చిరజీవినః 

వారు
  1. అశ్వద్ధామ 
  2. బలి
  3. వ్యాసుడు 
  4. హనుమంతుడు
  5. విభీషణ
  6. కృపాచార్యుడు 
  7. పరశురాముడు 

18, ఆగస్టు 2014, సోమవారం

28 మంది వ్యాసులు

మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు. 
వారు 

  1. స్వయంభు 
  2. ప్రజాపతి 
  3. ఉషన 
  4. బృహస్పతి 
  5. సవిత 
  6. మృత్యు 
  7. ఇంద్ర 
  8. వసిష్ఠ 
  9. సారస్వత 
  10. త్రిధామ 
  11. త్రివ్రిష 
  12. భరద్వాజ 
  13. అంతరిక్ష 
  14. వప్రి 
  15. త్రయారుణ 
  16. ధనుంజయ 
  17. కృతంజయ 
  18. రినజయ 
  19. భరద్వాజ 
  20. గౌతమ 
  21. హర్యాత్మ 
  22. వేణ 
  23. త్రిణవింధు 
  24. రిక్ష 
  25. శక్త్రి 
  26. పరసర 
  27. జాతుకర్ణ 
  28. కృష్ణ ద్వైపాయన 
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు 
  • ఋగ్వేదం - పైల మహర్షి 
  • యజుర్వేదం - వైశంపాయన 
  • సామవేదం - జైమిని 
  • అధర్వణ వేదం - సుమంతుడు 
  • పురాణములు - రోమహర్షనుడు 
  • భాగవతం - శుక మహర్షి