ఏడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఏడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2019, సోమవారం

సప్త గంగలు

మన పురాణములలో చెప్పిన అనేక విషయములలో పరమ పుణ్యమయములని నదులను చెప్తారు. అయితే మనకు ఉన్న అనేక నదులలో తలమానిక మైనది గంగా నది. అయితే ఆ గంగ కు సమాన మయినవి అని చెప్ప బడే ఏడు నదులు ఉన్నయి. వానిని సప్త గంగలు అని చెప్తారు. అవి
  1. గంగ
  2. గోదావరి
  3. కావేరి
  4. తామ్రపర్ణి
  5. సింధు
  6. సరయు
  7. నర్మద

18, అక్టోబర్ 2014, శనివారం

సప్తర్షులు

మనం ఉన్న ఈ మన్వంతరంలో మనకు గల సప్తర్షులు

  1. కశ్యపుడు 
  2. అత్రి 
  3. భరద్వాజుడు 
  4. విశ్వామిత్రుడు 
  5. గౌతముడు 
  6. వసిష్ఠుడు 
  7. జమదగ్ని 

10, సెప్టెంబర్ 2014, బుధవారం

సప్త పర్వతములు

పురాణముల ప్రకారం అత్యంత ప్రసస్తమైన పర్వతములు ఏడు. ఆ సప్త పర్వతములు 
  1. సుమేరు 
  2. కైలాస 
  3. మలయ 
  4. హిమాలయ 
  5. వింధ్యాచల 
  6. అగస్త్యాచల 
  7. గంధమాదన 

సప్త ద్వీపములు

ఇదివరకు ఒక్కటిగా ఉన్న భూభాగమును 7 భాగములుగా విభజించారు. అవి సప్త ద్వీపములు
  1. జంబు 
  2. పాలాక్ష 
  3. శాల్మలి 
  4. కుశ 
  5. క్రౌంచ 
  6. శాఖ 
  7. పుష్కల 

8, సెప్టెంబర్ 2014, సోమవారం

సప్త సముద్రములు

మనం కధలు చెప్పేటప్పుడు రాక్షసుని ప్రాణం సప్త సముద్రముల అవతల చిలుకలో ఉన్నది అని చెప్తాం కదా! మరి మనలో ఎంతమందికి ఆ సప్త సముద్రముల పేర్లు తెలుసు?

సప్త సముద్రములు 
  1. లవణ (ఉప్పు)
  2. ఇక్షురస (చెరకు రసం)
  3. సుర (మద్యం)
  4. ఘ్రిత (నెయ్యి)
  5. దహి (పెరుగు)
  6. క్షీర (పాలు)
  7. సుస్వద (తీయని నీరు)

సప్త లోకములు

క్రింది లోకములను పాటలములు అంటారు. పై లోకములు కూడా ఏడు. అవి
  1. భూలోక 
  2. భువర్లోక 
  3. సువర్లోక 
  4. మహర్లోక 
  5. జనర్లోక 
  6. తపోలోక 
  7. సత్యలోక 

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

సూర్యుడు- అశ్వముల పేర్లు

సూర్యుడు రధంమీద ఎక్కి ప్రయాణిస్తాడు అని, ఆ రధమునకు ఏడు  గుర్రములు ఉంటాయి అని చెప్తారు. మన పురాణముల ప్రకారం సూర్యుని అశ్వముల పేర్లు ఈ విధంగా ఇవ్వబడ్డాయి.
  1. గాయత్రి 
  2. సంవ్రిహతి 
  3. ఉషినిక 
  4. జగతి 
  5. త్రిశతుబ 
  6. అనుస్తుభ 
  7. పంక్తి 

పాతాళములు

పురాణముల ప్రకారం క్రిందనున్న లోకములను పాతాళములు అంటారు. అవి ఏడు  అని చెప్ప బడినవి.
అవి 


  • అతల 
  • వితల 
  • సుతల 
  • తలాతల 
  • మహాతల 
  • రసాతల 
  • పాతాళం