అద్రిక
అద్రిక ఒక అప్సరస. ఆమె తన అందానికి అతిహసించి ప్రవర్తించగా బ్రహ్మదేవుడు ఆమెను చేపగా పుట్టమని శపించాడు. అప్పుడు పశ్చాతాపం పొందిన అద్రిక తనకు శాపవిమోచనం చెప్పమనగా అప్పుడు బ్రహ్మ సృష్టిలో ఇప్పటి వరకు లేని విధంగా ఎప్పుడైతే చేపగా ఉన్న నీ కడుపులోనుండి ఇద్దరు మానవ సంతానం కలుగుతుందో అప్పుడు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు.ఎంతో కాలం చేపగా ఉన్నతర్వాత ఒకసారి ప్రమాదవశాత్తు ఉపరిచరవసువు యొక్క వీర్యం మింగుట వల్ల ఆమె గర్బం ధరించింది. చేపగా ఉన్న ఆమెను జాలరులు పట్టుకుని పొట్ట కోసి చూడగా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు ఆమె గర్భం నుండి జన్మించారు, ఆమెకు శాప విమోచనం జరిగింది.
ఈమెకు జన్మించిన ఈ ఆడపిల్ల పితృదేవల మానసపుత్రి, అమావస్య. ఆమె తన తండ్రులు ఇచ్చిన శాపం కారణంగా అద్రికకు జన్మించింది. కాలాంతరం లో ఆ ఆడపిల్ల మస్త్యగంధి గా, యోజనగంధిగా, సత్యవతి గా పేరుపొంది వ్యాసమహర్షికి తల్లి అయింది. తరువాతి కాలం లో ఈమె కురురాజైన శoతనుడిని వివాహం చేసుకుంది.
ఆ మగ పిల్లవాడు మస్త్యరాజ్యానికి రాజు అయినాడు.
adrika yenduku sapinchabadindo teliyajesinanduku krutajnatalu
రిప్లయితొలగించండిఆ పిల్లవాడి పేరు చెప్పలేదు
రిప్లయితొలగించండి