అశ్వసేనుడు
అశ్వసేనుడు తక్షకుని పుత్రుడు. అశ్వసేనుడు ఖాండవ వనదహనం నుండి తప్పించుకున్న వారిలో ఒకడు. అప్పుడు ఖాండవ వనదహనానికి సహాయం చేసిన అర్జునిని మీద పగతో కురుక్షేత్రo లో పదిహేడవ రోజు యుధం లో కర్ణుడు అర్జునుని మీదకు సర్పముఖాస్త్రం ప్రయోగించగా ఆ అస్త్రం యొక్క ముందు భాగం లో ఉండి అర్జునుని చంపే ప్రయతం చేసాడు. ఐతే శ్రీకృష్ణుడు ఇది గమనించి తన కాలి బొటన వేలితో రధమును భుమిలోకి నాలుగు అంగుళములు కుంగిoపచేయగా ఆ అస్త్రం అర్జునుని కిరీటాన్ని కొట్టేస్తుంది. అది చుసిన అశ్వసేనుడు కర్ణుని వద్దకు వెళ్లి మరలా అదే బాణ ప్రయోగం చేస్తే తాను ఈ సారి ఖచితంగా అర్జునుని సంహరిస్తాను అని చెప్తాడు. అది విన్న కర్ణుడు తాను ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మరలా ప్రయోగించను అని, తను ఇంతకు ముందు బాణo ప్రయోగించినప్పుడు అశ్వసేనుడు తన అస్త్ర శీర్ష భాగాన ఉన్నట్లు తెలియదని, తనకు ఎవరి సహాయం అవసరం లేదని చెప్తాడు. అప్పుడు వెళ్లి పోతున్న అశ్వసేనుడిని అర్జునకు చూపించి శ్రీకృష్ణుడు వధించమని చెప్పగా, అర్జునుడు అతని మీద బాణ ప్రయోగం చేస్తాడు. అర్జునుని అస్త్రములకు ఆ అశ్వసేనుని శరీరం ముక్కలు ముక్కలు అవుతుంది. ఆ తరువాతి కాలం లో తక్షకుడు పరిక్షిత్తుని చంపటానికి ఇది ఒక కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి