ఉపరిచర వసువు
చేది దేశాధిపతి వసువు, ధర్మాత్ముడు, ఇంద్రునితో సమానమైన బల పరాక్రమములు కలవాడు. ఒకసారి అతడు వేటకు వెళ్లి ఒక ముని ఆశ్రమమునకు వెళ్లి తపస్సు మొదలు పెట్టాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు దేవతా గణములతో ప్రత్యక్షమయి అతనికి ఒక దివ్య విమానం, వాడని పద్మములు కల మాల, దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కొరకు ఒక వేణు ఇష్టి ని ఇచ్చాడు. దేవాధిపతి ఐన తనకి భూలోకం లో ఉన్న వసువుకు మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అని మాట ఇచ్చాడు. ఈ వసువు విమానం లో తిరుగుతూ ఉండుటవల్ల ఈ వసువుని ఉపరిచర వసువు అన్నారు.
ఇంద్రుడు ఇచ్చిన వరం తో వసువు కు బృహగ్రధుడు, మణివాహనుడు, సౌభలుడు, యదువు మరియు రాజన్యుడు అనే ఐదుగురు పుత్రులు కలిగారు.
వారి రాజధాని దగ్గరే కోలాహలం అనే ఒక పర్వతానికి అక్కడే ప్రవహిస్తున్న శుక్తిమతి అనే నది మీద కోరిక కలిగి ఆ నది దారిని అడ్డగించాడు. అప్పుడు ఆ నది భాదను వసువు గమనించి ఉపరిచర వసువు తన కాలితో ఆ పర్వతాన్ని తన్ని దాన్ని తొలగించాడు. ఐతే అప్పటికే ఆ నదికి ఒక కొడుకు, ఒక కూతురు ఆ పర్వతం వల్ల జన్మించారు. అప్పుడు వారు ఆ పిల్లలని ఉపరిచర వసువుకి ఇచ్చారు. అప్పుడు వసువు ఆ నది పుత్రుడైన సుపదుని తన సైన్యాధికారి గా నియమించి అమ్మాయి ఐన గిరికను తానె వివాహం చేసుకున్నాడు.
ఒకసారి ఉపరిచర వసువు వేటకు వెళ్ళగా అక్కడ ఉన్న్న ప్రకృతి సౌందర్యాన్నిచూసి తన ఋతుస్నాత ఐన భార్య గుర్తురాగ వీర్య స్కలనం జరిగింది. తన వీర్యం నిష్ఫలం కాగూడదు కనుక దాన్నిఒక ఆకు దొన్నెలో ఉంచి, తన భార్యకు పంపదలచాడు. దాని కోసం అక్కడే ఉన్న ఒక శీఘ్రగామిని అనే ఒక డేగ ని ఆ పనికి కేటాయించి దాని మేడలో ఆ దొన్నెను కట్టాడు. ఆ డేగ వెళుతూ ఉండగా, దానికి కట్టి ఉన్నదొన్నెచుసిన మరొక డేగ అది మాంస ఖండమని భావించి దానికోసం వచ్చింది. అప్పుడు జరిగిన హడావిడి లో ఆ దొన్నె జారి యమునా నదిలో పడిపోయింది. దాని లోని వీర్యం ఒక చేప నోటిలో పడింది. ఒక అద్రిక అనే అప్సరస శాపకారణం గా ఆ చేప రూపo లో అక్కడ ఉంది. కొన్నినెలల తర్వాత జాలరులు ఆ చేపను పట్టుకున్నారు. అప్పుడు దాని పొట్ట లో వారికి ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల కనిపించారు. వారిద్దరిని ఆ జాలరులు వారి రాజుకి సమర్పించారు. అప్పుడు ఆ రాజు ఆ పిల్లవాడికి మస్త్యరాజ్య పట్టాభిషేకం చేసాడు. ఇక ఆ ఆడపిల్ల మస్త్య వాసనతో ఉంది. కనుక ఆమెను మస్త్య గంధి అని పిలిచి,ఆమెను జాలరులకు అధిపతి ఐన దాశరాజుకు ఇచ్చాడు.
ఆమే కాలాంతరం లో వ్యాసునికి తల్లి అయ్యి, తన చేపల వాసన పోగొట్టుకుని యోజన గoధి గా మారి, కురు రాజయిన శంతనుడిని వివాహం చేసుకుoది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి