5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వరూధిని

వరూధిని మౌల అనే గంధర్వుని కుమార్తె. ఏంతో సుందరమైన అప్సరస. ఆమెకు గంధర్వలోకం కన్నా హిమాలయ పర్వతప్రాంతం అంటే ఎంతో మక్కువ. అందుకనే ఆమె సర్వదా హిమాలయ పర్వత ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది.
ఒకరోజు ఆమె వద్దకు తను ఇంటికి వెళ్ళే మార్గం చెప్పవాసినది అని ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి అడిగాడు. అతనే ప్రవరాఖ్యుడు. అతని దివ్యసుందర రూపం చుసిన వరూధిని మరుక్షణం అతనిని వరించినది. అప్పటి వరకు ఆమెను వివాహం చేసుకుంటాం అనే ప్రస్తావనతో నాగ, సిద్ధ, గంధర్వ, దేవతలు, అసురులు ఆమెను అడిగారు. కానీ  ఆమె మనస్సు ఎవరినీ వరించలేదు. కాని మొదటిసారి ఒక బ్రాహ్మణ యువకుని ఆమె వరించినది.
ప్రవరాఖ్యుడు తాను  తన స్వగృహమునకు వెళ్ళే మార్గం చెప్పమని అడుగగా, ఆమె అతనిని వరించినది అని చెప్పినది. ఆమె తన హృదయవేదనను అతనిని అర్ధం చేసుకుని ఆమెను వరించి, ఆమె ప్రాణములు నిలుపవలసినది అని ప్రార్ధించినది. ప్రవరాఖ్యుడు అతని నిత్య విధులకు ఆలస్యం అవుతుంది కనుక త్వరగా ఇంటికి వెళ్ళే సంకల్పంలో ఉన్నాడు కనుక ఆమె అతనిని కనీసం ఒక్కసారి ఆమె భాదను తొలగించమని ప్రార్ధించినది. కానీ ప్రవరాఖ్యుడు అమిత నిష్టాగరిష్టుడు. అతను తన నిష్టను వదులుకొనుటకు ఇష్టపడకుండా అగ్ని దేవుని సహకారం తో ఇంటికి వెళ్లి పోయాడు.
కానీ వరూధిని విరహ తాపంతో రోదిస్తూ ఉండిపొయినది. ఆమె శోకమును ఆమెను నిరంతరం ప్రేమిస్తూ, అమెచేత అనేకసార్లు తిరస్కరించబడిన కలి అనే ఒక గంధర్వుడు చూసాడు. వరూధిని శోకం అతనిని మరింత భాదించినది. ఆమె శోక కారణం తెలుసుకుని ఆమెను అనునయించాలి అని భావించాడు. అతనికి గల దివ్యదృష్టి ద్వారా జరిగిన విష్యం తెలుసుకున్నాడు. అతనిముందు రెండు మార్గములు ఉన్నాయి ఆమె విచారమును దూరం చేయుటకు.
  1. బ్రాహ్మణ యువకుని తిరిగి వరూధిని వద్దకు తీసుకు రావటం 
  2. తనే స్వయంగా బ్రాహ్మణ రూపం లో ఆమెకు చేరువ అగుట 
బ్రాహ్మణ యువకుడు ఆమె ప్రతిపాదనను ఒప్పుకునే వాడయితే తిరిగి ఇంటికి వెళ్ళేవాడే కాదు. కనుక రెండోవ మార్గమే సరి ఐనది అని భావించి ఆ యువకుని రూపంలో వరూధిని వద్దకు వెళ్ళాడు. 
మాయా ప్రవరాఖ్యుని చూసిన వరూధిని శోకంనుండి తేరుకున్నది. సంతోషించినది. ఐతే వారి సంగమమునకు మాయా ప్రవరుడు ఒక నిబంధన ఉంచాడు. వారి సంగమ సమయంలో వరూధిని కన్నులు ముసుకోవాలి అని. 
ప్రవరుని చూసిన, ఆటను తిరిగి తనవద్దకు వచ్చిన సంతోషంలో ఆమె ఆ నిబంధనను ఒప్పుకున్నది. 
వారి సంగమ సమయంలో ఆమె తన కన్నులు మూసుకుని ప్రవరుని గురించి అలోచించ సాగినది. వరూధిని గర్భందాల్చినది. 
ప్రవరుని ఆలోచనలు, గంధర్వుని సంగమం వల్ల జన్మించిన ఆ బాలుడు దివ్య తేజస్సు తో జన్మించాడు. అందువల్ల అతనికి స్వరోచి అని నామకరణం చేసారు. 

కాలాంతరంలో ఈ స్వరోచి కళావతి, విభావరి మరియు మనోరమ లను వివాహం చేసుకుని రెండోవ మనువయిన స్వారోచిష అనే మనువు జన్మకు కారణం అయినాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి