29, మార్చి 2016, మంగళవారం

తండ్రి - కొడుకు

ఈ రోజులలో ఒక తండ్రి తన కొడుకుతో ఏ వయస్సులో ఎలా  ఉండాలో చెప్తారు కదా! దానికి మూలమయిన సంస్కృత శ్లోకం ఏదో చూద్దామా!
ఈ శ్లోకం చాణక్య నీతి దర్పణంలో ఉన్నది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ 
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్ 
ఈ శ్లోకమునకు అర్ధం: కొడుకునకు ఐదు సంవత్సరములు వచ్చేవరకు లాలించాలి. గారాబం చేయాలి. ఐదు నుండి పది సంవత్సరముల వరకు  మంచి చెడులు నేర్పేందుకు దండించాలి. పదహారు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత మిత్రునిగా చూడాలి.


27, మార్చి 2016, ఆదివారం

శీలం

శీలం అనే మాటను  మనం ఈ రోజులలో అనేక సందర్భములలో వాడుతూ వున్నాం కదా!
"శీలం పరమ భూషణం"  అని ఆర్యోక్తి. మరి దానికి మన శాస్త్రములలో ఉన్న నిర్వచనము ఎలా ఉందో చూద్దామా!
వ్యాస భగవానుడు మహా భారతంలో  అనుశాసనిక పర్వంలో శీలం గురించి ఈ  శ్లోకం చెప్పారు.

అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా!
అనుగ్రహం చ దానంచ శీలమే తత్ప్ర శన్యతే!!
మనసా వాచా కర్మణా, ఈ సకల సృష్టిలోని జీవులకు, ద్రోహం (కష్టం) కలిగించకుండా, వాని పై దయను కలిగి ఉండి, వానికి ఇవ్వగలిగిన దానం చేయుటను శీలం అంటారు. 

25, మార్చి 2016, శుక్రవారం

మూర్ఖులు

మన శాస్త్రములలో అన్ని రకముల మనుషుల భావములకు నిర్వచనములు చెప్పే ఉన్నారు. ఎవరయినా చెప్పిన మాట వినక పోతే మనం ఎక్కువగా వాడే పదం "ముర్ఖం, మూర్ఖత్వం".
ఇంతకీ ఈ మూర్ఖత్వం గురించిన నిర్వచనం ఎలా ఉంటుందో చూద్దామా!

మూర్ఖస్య పంచచిహ్నాని గర్వో దుర్వచనం తధా!
హఠశ్చైవ విషాదశ్చ పరోక్తం నైవ మన్యతే!!

దీనికి అర్ధం: ముర్ఖునికి ఉండే విపరీతమైన ఐదు లక్షణములు ఏవనగా
  1. గర్వం 
  2. చెడ్డ మాటలు మాట్లాడటం 
  3. మొండిపట్టుదల 
  4. అతిగా రోధించటం 
  5. ఇతరులు చెప్పిన మంచి మాటలు వినక పోవటం
అదండీ సంగతి. పైన చెప్పిన ఏలక్షణం ఎవరిలో కనిపించినా వారు మూర్ఖులు అని నిర్వచించారు మన పెద్దలు. 

23, మార్చి 2016, బుధవారం

విద్యార్ధి -

మానవుడు నిరంతర విద్యార్ధి. సర్వదా తమ చుట్టూ జరిగే అనేక సంఘటనలనుండి ఎంతోకొంత నేర్చుకుంటూనే ఉంటాడు. అయితే వానిని అతను ఎంతవరకు అనుభవంలోనికి తీసుకుని, పాటించగలడు అనేది అతని మానసిక పరిపక్వతపై ఆధార పడి ఉంటుంది.
అయితే ఒక విద్యార్ధి తను విద్యను అభ్యసించే సమయంలో ఏ విషయములపై శ్రద్ధ చూపకుండా ఉండాలో, వేనిని పూర్తిగా వదలి వేయాలో చాణక్యుడు తన చాణక్య నీతి దర్పణంలో చెప్పారు. ఆ శ్లోకం 
కామం క్రోధం తధా లోభం స్వాదం శృంగారకౌతుకే !
అతి నిద్రాతి సేవే చ విద్యార్దీ హ్యష్ట వర్జయేత్!!
పైన చెప్పిన శ్లోకములో విద్యార్ధి ఎనిమిది విషయములకు దూరంగా ఉండాలని చెప్పారు. అవి 
  1.  శరీరమును సుఖముగా ఉంచు ప్రయత్నములు (మెత్తని పరుపులు, ఆసనములు), 
  2. విపరీతమయిన కోపము, 
  3. కొంచెంకూడా కష్టపడకుండా విద్యను కానీ మరేదయినా పొందాలనే లోభము, 
  4. మంచి రుచికరమయిన ఆహారం నందు అభిలాష,
  5. అలంకరించుకోవటం, 
  6. అతి నిద్ర 
  7. మరొకరిని అతిగా సేవించుట, 
  8. మరొకరిని అవసరం ఉన్నా లేకున్నా పొగడుట అనే ఈ ఎనిమిది గుణములను విద్యార్ధి వదలిపెట్టాలి. 
 

21, మార్చి 2016, సోమవారం

దండన

మన విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైనది దండన. ఇతర దేశములలో ఈ దండన పద్దతి కేవలం సౌమ్యంగా ఉంటుంది. కానీ మన దేశంలో ఈ దండన కొంచెం గంభీరంగానే ఉంటుంది.
అలా ఉండటానికి గల అవసరం చాణక్యుడు తన చాణక్య నీతి దర్పణం లో చెప్పాడు.
లాలనాథ్ బహవో దోషా స్తాడనాత్ బహవో గుణాః 
తస్మాత్పుత్రం చ శిష్యంచ తాడయేన్న తులాలయేత్ !
పైన చెప్పిన శ్లోకంలో భావం ఈ విధంగా ఉంది.
గారాబం (లాలన) చేయుట వలన అనేకములయిన దోషములు పెరుగుతాయి. అదే దండించుట వలన అనేకములయిన సుగుణములు వృధి కలుగుతుంది. అందువలన శిష్యులను, పిల్లలను అవసరమైన మేర దండించాలి.


19, మార్చి 2016, శనివారం

నింద - స్తుతి

మన శాస్త్రములలో చెప్పిన విషయములు వినటానికి కొంచెం కఠువుగా ఉన్నప్పటికీ నిర్దుష్టంగా సత్యం చెప్తాయి. ఇప్పుడు అటువంటి నిర్వచనముల గురించి తెలుసుకుందాం!
అవి నింద మరియు స్తుతి.  వీనిని నిర్వచించు శ్లోకము చూడండి.

గుణేషు దోషారోపణం యసూయ అధవా దోషేషు గుణారోపణ యసూయ 
 తధా గుణేషు గుణారోపణం దోషేషు దోషారోపణం స్తుతిః 

పైన చెప్పిన శ్లోకం ప్రకారం 
నింద : ఒక వ్యక్తి గుణములను దోషములుగా, దోషములను గుణములుగా చెప్పటం నింద. 
స్తుతి: ఒక వ్యక్తి గుణములను గుణములుగా, దోషములను దోషములుగా చెప్పటం స్తుతి. 

విశ్లేషణ:
వినటానికి అర్ధం చేసుకోవటానికి కొంచెం విపరీతంగా ఉన్నా ఒక వ్యక్తి దోషములను దోషములుగా చూపటం కూడా స్తుతి అని చెప్పారు. అలా ఎత్తి చూపటం వలన ఆ వ్యక్తి తన దోషములను దూరం చేసుకునే అవకాశం పొందగలుగుతాడు. 
నింద అంటే అతని దోషములను కూడా గుణములుగా చెప్పినప్పుడు అతనికి అతనిలోని లోపం తెలుసుకునే అవకాశం ఉండదు. అతని దోషమును తెలుసుకోలేని వారు, ఆ దోషమును దూరం చేసుకునే అవకాసం కూడా ఉండదు. 
గుణములను దోషములుగా చూపినప్పుడు బలహీన మనస్సుకల వారయితే వారి గుణములను వదిలే అవకాశం కూడా ఉండవచ్చు. 
మరో విధంగా చుస్తే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం స్తుతి, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించి చూపుట నింద. 

17, మార్చి 2016, గురువారం

ఆళ్వారులు

శ్రీ మహా విష్ణు భక్తశిఖామణులను ఆళ్వారులు అంటారు. వీరు 12 మంది. వీరు 12 మందికూడా శ్రీ వైకుంఠం లో ఉండే వారు వారి అంశములతో భూమి పై జన్మించారు అని పెద్దలు చెపుతారు. వీరు స్వామి వారిని స్తుతిస్తూ వారి పై 4000 భక్తి శ్లోకములను/ పాశురములను రచించారు.  ఈ 4000 శ్లోకములను కలిపి నాలావిర దివ్య ప్రభందం అంటారు.తమని తాము భగవత్ దాసులుగా చెప్పుకుంటారు. వీరు ముక్తి కాలంలో స్వయంగా శ్రీవారిలో లీనమయారు అమీ చెప్తారు. వీరు ఈ భూమిపై తిరుగాడిన కాలం క్రీ. శ. 6 నుండి క్రీ. శ 9 వ శతాబ్దపు మధ్య కాలం అని చెప్తారు. ఇప్పుడు ఆ 12 మంది పేర్లు వారి వివరములు తెలుసుకుందాం!


  1. పోగై ఆళ్వార్ : 
    • కాలం : 7వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : కాసార యోగి, పద్మ ముని 
    • అంశ : పాంచజన్యం (శ్రీ మహా విష్ణు శంఖం)
  2. భూతనాధ్ ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : సిద్ధార్ధి 
    • అంశ : కౌమోదకి (గధ)
  3. పై ఆళ్వార్ :
    • కాలం : 7వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: కైరవ ముని
    • అంశ : నందకం (ఖడ్గం)
  4. తిరుమలిసై ఆళ్వార్: 
    • కాలం : 7వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : భక్తిసారర్ 
    • అంశ : సుదర్శనం (చక్రం)
  5. తిరుమంగై ఆళ్వార్: 
    • కాలం: 8వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: నాలు కవి పెరుమాళ్ 
    • అంశ : శారంజ్ఞం (విల్లు) 
  6. తొండరడిపొడి ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : విప్ర నారాయణ 
    • అంశ : వనమాల 
  7. తిరుప్పాన్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : పాణర్, యోగి వాహనర్ 
    • అంశ : శ్రీవత్సం 
  8. కులశేఖర్ ఆళ్వార్:
    • కాలం : 8వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: కొల్లిక్కావాలన్ 
    • అంశ : కౌస్తుభం 
  9. పెరియాళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: విష్ణు చిత్తర్ 
    • అంశం : గరుడ 
  10. శ్రీ ఆండాళ్ :
    • కాలం: 9వ శతాబ్దం 
    • ఇతర పేర్లు : సూదికొడుత్ర నాంచియార్ 
    • అంశం: భూదేవి 
  11. నమ్మాళ్వార్ 
    • కాలం: 9వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: శఠగోపా, పరాంకుశం
    • అంశం: విష్వక్సేన 
  12. మధుర కవి ఆళ్వార్ :
    • కాలం : 9వ శతాబ్దం 
    • ఇతర పేర్లు: ఇంకవియర్ 
    • అంశం: వైనతేయ (గరుడ)

16, మార్చి 2016, బుధవారం

మత్స్యగంధి - చేపల వాసన రహస్యం

మనం ఇంతకుముందు వేద వ్యాస జననం గురించి చెప్పుకునే సమయంలో సత్యవతి గురించి, ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన (ఆ కారణంగానే ఆమెను మత్స్యగంధి అనే వారు) గురించి చెప్పుకున్నాం.
మనకు సహజంగా వచ్చే అనుమానం ఆమెకు చేపల వాసన ఎందుకు వచ్చింది? అసలు అలా ఎవరికయినా ఉంటుందా? అది కవి గారి కల్పనే గానీ? చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు.
కానీ మన పురాణములలో చెప్పిన విషయములు మన విజ్ఞాన శాస్త్రములకు అందవు కనుక అవి అన్ని అధ్బుతకల్పనలు అని అందరూ కొట్టి పారేస్తూ ఉంటారు. 18వ శతాబ్దం వరకు మన పురాణములలో తప్ప భౌతికంగా విమానం అంటే ఎవరికీ తెలియదు. తరువాత మన విజ్ఞాన శాస్త్రం అభివృధి చెందింది. విమానములు తయారు చేయబడ్డాయి. అలాగే ఇంకా చాలా విషయములు మన విజ్ఞానమునకు ఇంకా అర్ధం కావు.

ఈ మత్స్యగంధం గురించి ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు కొంత సమాచారం సాధించారు. ఈ వాసన రావటం అనే ఈ  వైద్య పరిస్థితి కి "ఫిష్ ఓడర్ సిండ్రోమ్" అని పిలుస్తారట. అంటే మన తెలుగులో చేపల వాసన వచ్చే పరిస్తితి అని అర్ధం. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే మానవుల చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే "ట్రై మిథైల్ అమీన్యూరియ" అనే రసాయనం అట. సహజంగా ఈ రసాయనం అందరిలో కొంత మొత్తంలో ఉత్పత్తి అయినా దాన్ని  తటస్థీకరించే వ్యవస్తను చర్మం కలిగి ఉంటుందట. ఒకవేళ ఈ రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అయిన సందర్భంలో ఆ వ్యవస్థ దెబ్బతిని అప్పుడు ఆ మనిషి నుండి చేపల వాసన వస్తుందట.
అదండీ సంగతి. ఇక ముందు మన శాస్త్రవేత్తలు ఈ మత్స్యగంధం పోయి అందరూ యోజనగంధులుగా మారే శాస్త్రీయతను నిరూపించగలిగితే బాగుంటుంది కదా!

15, మార్చి 2016, మంగళవారం

రేవతి నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
రేవతి నక్షత్రం 
వృక్షం : విప్ప 
శ్లోకం : రేవతీత్రి తారాశ్చ మధువోమత్స్యాకృతిః
          రక్త వర్ణమయూరశ్చ మందార మకరతం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 105 నుండి 108 వరకు గల శ్లోకములు రేవతి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : రేవతి నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన సమయమునకు కావలసిన సహాయం అందుతుంది. నూతన వ్యాపారములలో, బృహత్తర భాద్యతలు స్వీకరించటం, వానిని నెరవేర్చటంలో ముందుంటారు. దీర్ఘకాలిక వ్యాదులు దరి చేరవు. 

14, మార్చి 2016, సోమవారం

ఉత్తరాభాద్ర నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఉత్తరాభాద్ర నక్షత్రం 
వృక్షం : వేప 
శ్లోకం : ఉత్తరా భాద్ర ద్వితారాశ్చ నింబోద దండాకృతిః
          కృష్ణ చక్రవాకశ్చ కరంజ పత్తీషు నీలం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 101 నుండి 104 వరకు గల శ్లోకములు ఉత్తరాభాద్రా నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : ఉత్తరాభాద్ర నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన మంచి వైవాహిక జీవనం ఉంటుంది. ఉన్నత విద్య, ఉన్నత పదవులు లభిస్తాయి. సంతాన సౌఖ్యం కలుగుతుంది. శ్వాసకు సంబందించిన వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

13, మార్చి 2016, ఆదివారం

పూర్వాభాద్ర నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్వాభాద్ర నక్షత్రం 
వృక్షం : మామిడి 
శ్లోకం : పూర్వాభాద్రాద్వితారాశ్చ ఆమ్రోచఖడ్గాకృతిః
          కృష్ణవర్ణ కపోతశ్చ అర్క పుష్యరాగమేవచ!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 97 నుండి 100 వరకు గల శ్లోకములు పూర్వాభాద్ర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : పూర్వాభాద్ర నక్షత్రమునకు చెందిన వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఆర్ధిక స్థిరత్వం లభిస్తుంది, రాజకీయ లబ్ధి వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కళారంగములలో రాణించగలుగుతారు. పిక్కలకు సంబందించిన సమస్యలు రావు. 

12, మార్చి 2016, శనివారం

శతబిష నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
శతబిష నక్షత్రం 
వృక్షం : కదంబ 
శ్లోకం : శతభిశత తారాశ్చ కదంబ పుష్పాంనిభాకృతిః
          రక్తవర్ణ కోకిలశ్చైవ గోమేధికంచ యధాక్రమాత్!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 93 నుండి 96 వరకు గల శ్లోకములు శతబిష నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : శతబిష నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన జీవితంలో త్వరగా స్థిరపడతారు. శరీర పుష్టి కలుగుతుంది. కీళ్ళ సమస్యలు రావు. 

11, మార్చి 2016, శుక్రవారం

ధనిష్ఠ నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ధనిష్ఠ నక్షత్రం 
వృక్షం : జమ్మి 
శ్లోకం :  ధనిష్టా పంచతారాశ్చ శమీమృదంగాకృతిః
           శ్వేత బ్రమరశత పుత్రపుష్పశ్చ పగడంచైవ యదాక్రమం!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 89 నుండి 92 వరకు గల శ్లోకములు ధనిష్ఠ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : ధనిష్టా నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన సత్ కుటుంబ వృది  జరుగుతుంది. వీరికి తెలివి తేటలు పెరుగుతాయి.  మెదడుకు సంబంచిన వ్యాదులనుండి ఉపశమనం లభిస్తుంది. 

10, మార్చి 2016, గురువారం

శ్రవణ నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
శ్రవణ నక్షత్రం 
వృక్షం : తెల్ల జిల్లేడు 
శ్లోకం : శ్రోణాత్రితారాశ్చ న్యగ్రోధోదీషుమత్యాకృతిః
          కృష్ణమయూరజాతి పుషశ్చ మౌక్తికంచైవపుకాశితః 
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 85 నుండి 88 వరకు గల శ్లోకములు శ్రవణ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : శ్రవణ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఆర్ధిక  సమస్యలు తొలగుతాయి. మానసిక సమస్యలు తొలగుతాయి. సకల కార్యములు విజయవంతం అవుతాయి. 

9, మార్చి 2016, బుధవారం

ఉత్తరాషాడ నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఉత్తరాషాడ నక్షత్రం 
వృక్షం : పనస 
శ్లోకం : శ్రీ ఉత్తరాషాడ ద్వితారాశ్చ పనసోశయ్యాకారః
          రక్త వర్ణ కోకిలశ్చేవ పంచవర్ణశ్చ కెంపున్భవేత!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 81 నుండి 84 వరకు గల శ్లోకములు ఉత్తరాషాడ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం: ఉత్తరాషాడ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన అభివృధి సుసాధ్యం అవుతుంది. ఆర్ధిక స్థిరత్వం కలుగుతుంది. చర్మవ్యాధులు దరి చేరవు. 

8, మార్చి 2016, మంగళవారం

పూర్వాషాడ నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

 పూర్వాషాడ నక్షత్రం 
వృక్షం : అశోక/ నిమ్మ 
శ్లోకం : పూర్వాషాడా ద్వితారాశ్చ నెమ్మి వృక్ష దండా కృతిః
          శ్వేతవర్ణశ్చశుకశ్చ కల్వారపుప్పేషు వజ్రం తధా! 
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 77 నుండి  80 వరకు గల శ్లోకములు పూర్వాషాడ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం :  పూర్వాషాడ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరి వినయ విధేయతలు పెరుగుతాయి. వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వాతం, కీళ్ళ సమస్యలు తొలగుతాయి. 

6, మార్చి 2016, ఆదివారం

శివుని ఆహార్యం - విశ్లేషణ

 సర్వదా సదాశివుడ్ని మనం అరూపరూపిగా అంటే లింగ రూపంలో చూస్తాం. కానీ మన పెద్దలు శివుని మానవ రూపంలో చూపే సందర్భంలో ఆతని ఆహార్యానికి ఎంతో విలక్షణతను ఇచ్చారు. మన హిందూ ధర్మంలో ఒక దేవతకు ఏదయినా ఒక రూపం ఇచ్చినప్పుడు, అది వారి ప్రత్యేకతను చాటటమే కాకుండా ఆ దేవత సర్వమానవాళికి ఇవ్వవలసిన/ ఇవ్వగలిగిన వరములు లేదా చేయగలిగిన కార్యములను ఒక చిన్న అమరిక ద్వారా చెప్తారు. మనం ఈ విషయాన్ని ఇంతకు ముందు వినాయకుని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహాదేవుని గురించి తెలుసుకుందాం!


శివుని ఆకారం మనకు సదా ధ్యాన మగ్నుడయి, చంద్ర మరియు సర్పాభరణ భుషితుడయి, తలపై గంగమ్మతో, పరచి ఉన్న జఠాజూఠంతో, వొంటినిండా విభూది రాసుకుని, నుదుటిన మూడవ కన్నుతో, మెడలో పుర్రెల మాల (కొన్ని చోట్ల), చేతిలో త్రిశూలం, ఢమరు ధరించి, నీలి కాంతులు వెదజల్లుతున్న దేహంతో, పులి/ ఏనుగు చర్మం ధరించి కనిపిస్తారు కదా ఇప్పుడు అవి అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

  1. చంద్రుడు: శివుని తలపై చంద్రుడు ఉంటాడు. దీనికి రెండు కారణములు చెప్తారు.
    • చంద్రుడు మనః కారకుడు. మానవుని సుఖసంతోషములు అతని మనఃస్తితిపై ఆధార పడి ఉంటాయి కనుక శివుడు చంద్రుడ్ని ధరించాడు 
    • చంద్రుడు కాలమునకు ప్రతీక (కాలాన్ని చంద్రాయణాలుగా కొలుస్తారు). శివుడు కాలమును జయించినవాడు అని చెప్పటానికి చంద్రుడుని శివుని తలపై చూపిస్తారు. 
  2. భుజంగ భూషణం: శివుడు పాములను ధరించటానికి అనేక అర్ధములు చెప్తారు.  అవి 
    • పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. మనకు అత్యంత భయ కారకములు, వానిని ధరించుట ద్వారా శివుడు మనలను కాపాడతాను అనే అభయం ఇస్తున్నాడు. 
    • మెడ చుట్టూ తిరిగి ఉన్న పాము కాల చక్రంనకు సంకేతం.   
    • పాము ఆకారం కుండలిని శక్తిని పోలి  ఉంటుంది కనుక తనను భక్తిశ్రధలతో పూజిస్తే వారికి జ్ఞానమును ప్రసాదిస్తాడు.
    • పాము గర్వమునకు సూచిక. తన గర్వమును ఎవరైతే గెలుస్తారో వారికి అది ఒక ఆభరణం అవుతుంది తప్ప వారికి హాని చేయలేదు అని చెప్పటం 
    • పాము మానవుని కోరికలకు ప్రతిరూపం. శివుడు సకల కోరికలను జయించినవాడు కనుక ప్రతీకాత్మకంగా పాము అతనికి ఆభూషణం అయింది 
  3. గంగమ్మ : బ్రహ్మదేవుని, శ్రీ మహావిష్ణువును తాకి శివుని తలపై నిలచిన గంగమ్మ పవిత్రతకు ప్రతీక. గంగమ్మ నిరంతర ప్రవాహం జ్ఞానమునకు ప్రతీక. జలము, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. 
  4. త్రినేత్రం : మహాదేవుని నుదుటిన ఉన్న మూడవ నేత్రం సకల ద్వంద్వములకు అతీతమైన పరమ జ్ఞానమునకు ప్రతీక. ఇది సత్గురు కృపవలన మాత్రమే సాధ్యం కనుక దీనిని కన్నుగా సూచించారు.  దీని వలన మాత్రమే  గెలువగలరు. ఇది ఆజ్ఞా చక్రమునకు స్థానం. 
  5. భస్మం: 
    • స్థూలంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఏ వస్తువు అయినా అగ్నికి ఆహుతి అయితే మిగిలేది భస్మమే. కనుక శివుడు లయకారుడు  చెప్పేందుకు భస్మం ధరిస్తాడు.  
    • సూక్ష్మంగా చెప్పాలంటే భస్మం నిరంతర బ్రహ్మానందమునకు ప్రతీక. భస్మమునకు నాశనం లేదు. 
  6. త్రిశూలం:  ఇది శివుని ఆయుధం. అజ్ఞానమును అంతమొందిస్తుంది. శూలం అంటే సకల భాధలను తొలగించేది అని అర్ధం 
    • శివుడు త్రిగుణాతీతుడు (సత్వ రజః తమో గుణములకు అతీతుడు) అని చెప్పటం.
    • త్రికాలములు (భూత భవిష్యత్ వర్తమాన)  అధిపతి అని చెప్పటం 
    • త్రిస్థితులకు (జాగృత్, స్వప్న, సుషుప్తి) అధినేత అని చెప్పటం 
    • త్రితాపములను (ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక) పోగొడుతుంది. 
  7. ఢమరు : 
  8. Image result for infinity symbol

    • ఈ సృష్టి వస్తూ పొతూ ఉంటుంది అని స్థూలంగా చెప్పటం ఈ ఢమరు ఆకారం చెప్తుంది. అంతేకాకుండా ఈ ఢమరు ఆకారం అనంతమునకు (infinity) ప్రతీక.
    • ఈ ఢమరు సృష్టిమొదటి శబ్దమును (ప్రణవమును) పలికింది. కనుక ఢమరు శబ్దమునకు ప్రతీక. ఈ సృష్టిలో సర్వం ఈ శబ్దమునకు చెందినదే. 
  9. జఠాజూఠం/శరీరపు నీలి క్రాంతి: నిజమునకు శివునికి ఒక ప్రత్యేకమయిన ఆకారం లేదు. మనం మన సౌకర్యార్ధం అతనికి ఒక రూపమును ఆరోపించాము. అతను సర్వత్రా ఆకాశం వలే వ్యాపకుడు అని చెప్పటానికి నీలి రంగు చూపబడినది. అతని పరచుకున్న జఠాజూఠం అతని సర్వవ్యాపకత్వమునకు సూచిక. 
  10. నంది వాహనం: నంది మహా దేవుని వాహనం మాత్రమే కాదు. అతని సర్వసైన్యాధి పతి కూడా. 
    • నంది ధర్మమునకు ప్రతీక 
    • నంది అంటే పశువు. పాశముతో కట్టబడునది, మనందరికీ ప్రతీక. తన నాధుడయిన పశుపతినాదునికి సదా వసీభూతమై ఉంటుది. 
    • నంది అంటే నిరంతర భగవత్ చింతన. ఎంతకాలమయినా సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 
  11. పులి చర్మం: శివుడు పులి చర్మంపై కుర్చుని ఉంటాడు. పులి అంటే అతి క్రూర జంతువు. కాలం కూడా క్రురమైనదే. 
    • పులి అమ్మవారి (శక్తి) వాహనం. శివుడు సర్వ శక్తులకు అధిపతి. 
    • పులి కామమునకు ప్రతీక. శివుడు కామారి. 
  12. ఏనుగు / జింక చర్మం: శివుడు ఏనుగు లేదా జింక చర్మం కట్టుకుని ఉన్నట్లు చూస్తాం. 
    • ఏనుగు గర్వమునకు ప్రతీక. ఏనుగు చర్మం ధరించుట ద్వారా గర్వమును గెలిచిన వానిగా గుర్తించాలి
    • జింక అత్యంత ఉద్విగ్నంగా ఉంటుంది, మనసులా. ఉద్విగ్నమైన మనసును గెలిచినవాడు అని చెప్పటం 
  13. మెడలో పుర్రెల మాల: ఇది మనకు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. 
    • శివుడు లయకారకుడు అని చెప్పటం.
    • సృష్టి ముగిసిన ప్రతిసారి బ్రహ్మగారి కపాలం ఆ మాలకు గృఛుతూ ఉంటారట. అంటే శివుడు అనంతుడు అని చెప్పటం. 

5, మార్చి 2016, శనివారం

ప్రదోష కాలం - శివ పూజ


ఒకప్పుడు దేవదానవులు అమృతం కోసం వాసుకిని త్రాడుగా చేసుకుని మంధర గిరిని కవ్వం చేసుకుని పాలసముద్రం చిలికారు. ఆ సమయంలో ముందుగా హాలాహలం  వచ్చింది. అప్పుడు వారందరూ మహాదేవుని శరణు వేడారు. అప్పుడు కరుణాసాగరుడయిన మహాదేవుడు వారిని మన్నించి ఆ విషమును స్వీకరించి, త్రాగి, దానిని తన గొంతులోనే నిలుపుకున్నాడు. దాని కారణంగా శివుని కంఠం నల్లగా మారినది. కనుకనే అతనికి నీలకంఠుడు అని పేరు వచ్చింది.
తరువాత దేవదానవులు మళ్లీ తిరిగి  మధనం మొదలుపెట్టారు.  అప్పుడు వారికి క్రమంగా అన్ని రత్నములు లభిస్తూ చివరగా ద్వాదశి రోజున వారికి అమృతం లభించింది. అమితానందం పొందిన దేవతలు నీలకంఠుని కనీసం తలచకుండా, ఆతనికి ధన్యవాదములు తెలుపుట మరచి పోయారు. మరునాడు అనగా త్రయోదశి రోజు వారు చేసిన తప్పు వారికి తెలిసివచ్చింది. వెంటనే వారు భోళాశంకరుని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారట. వారిని క్షమించేసిన పరమ శివుడు నందీశ్వరుని కొమ్ముల మధ్యలో ఆనందతాండవం చేసారట. కనుక ఆ సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో శివుని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని పెద్దలు చెప్తారు.
ఈ ప్రదోష కాలంలో శివునికి ఏ పదార్ధంతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూద్దాం!

పాలు  - దీర్ఘాయువు
నెయ్యి - మోక్షం
పెరుగు - సత్ సంతానం
తేనె     - మధురమైన/ శ్రావ్యమైన స్వరం
బియ్యపు పిండి - ఋణముల నుండి విముక్తి
చెరకు రసం - ఆరోగ్యం
పంచామృతం - ధన వృద్ధి
చక్కర - శతృవినాశనం
అన్నం - సుఖ వంతమైన జీవితం
చందనం - లక్ష్మీ కటాక్షం
నిమ్మ - మృత్యు భయం తొలగుతుంది

ఓం నమః శివాయ 

పంచభూతములు - శివలింగములు

సర్వ జీవకోటికి ఆధారం పంచభూతములు. జగదాధారుడయిన మహాదేవుడు అరూప రుపిగా మనకు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ పంచభూత శివలింగములు మన దక్షిణా పధంలో ఉన్నాయి. అవి
  1. ఆకాశ లింగం - చిదంబరం, తమిళనాడు 
  2. వాయు లింగం - శ్రీ కాళహస్తి, ఆంధ్రప్రదేశ్ 
  3. అగ్ని లింగం - అరుణాచలేశ్వరం, తమిళనాడు 
  4. జల లింగం - జంబుకేశ్వరం, తమిళనాడు 
  5. పృథ్వి లింగం - కంచి తమిళనాడు/ గోకర్ణ, కర్నాటక   
ఓం నమః శివాయ 

మూల నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

మూల నక్షత్రం : 
వృక్షం : తెల్ల గుగ్గిలం 
శ్లోకం :  మూలా నవతారాశ్చ వేగీశ కృష్ణే హలాకృతిః
           చక్రవాకేషు రక్తాశోక పుష్పశ్చ రత్నే వైడూర్యం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 73 నుండి 76 వరకు గల శ్లోకములు మూల నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం : మూల నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఉత్తమ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. సత్ సంతానం కలుగుతుంది. దీర్ఘ వ్యాదులయిన మధుమేహం వంటి వ్యాధులు దరి చేరవు.  

4, మార్చి 2016, శుక్రవారం

జ్యేష్ట నక్షత్రం

మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

జ్యేష్ట నక్షత్రం:
వృక్షం : తెల్ల లొద్ది 
శ్లోకం : జ్యేష్టాత్రితారాశ్చ విషవృక్షశ్చే కంచులా కృతిః
          రక్తవర్ణ చాతకశ్చేవ పటోలీ  మకరం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 69 నుండి  72 వరకు గల శ్లోకములు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును. 

ఫలితం: ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాద్యతలను విజయవంతంగా నిర్వహించ గలుగుతారు. వీరికి వాతం, కాళ్ళు, చేతులకు చెందిన నొప్పులు తగ్గుతాయి. 

3, మార్చి 2016, గురువారం

నాయన్మారులు / నాయనారులు

నాయన్మారులు / నాయనారులు అంటే 63 మంది మహా శివ భక్తులు. వీరి గురించి చెప్పే పురాణం "పెరియపురాణం". దీనిని చోళ రాజుల వద్ద మంత్రిగా ఉన్న "సెక్ఖియార్" అనే పండితులు రచించారట. 

కేవలం 63 మందే ఎందుకు? శివ భక్తులు కేవలం 63 మందేనా? ఇంకా ఎక్కువ ఉండేవారు కాదా! ఇప్పుడు లేరా? 
ఎందరో ఉన్నారు.  అంతకు చాలా రెట్లు ఉంటారు. మరి కేవలం 63 మంది గురించి మాత్రమే ఎందుకు చెప్పారు? ఇది కేవలం ఆ మహాదేవుడు  భక్తులను తనవైపుకు ఏ విధంగా లాక్కుని తెచ్చుకోగలడో చెప్పే ప్రయత్నం మాత్రమే. 
వీరు 63 మంది తమ శైవ సిద్దాంతాన్ని ప్రచారం చేసారు. వీరు సర్వధా పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ ఉండేవారు. 
వారి పేర్లు 
  1. 1.     సుందర మూర్తి నాయనార్ 
    2.     తిరు నీలకంఠ నాయనార్ 
    3.     ఇయర్ పగై నాయనర్ 
    4.     ఇల్లయాన్గుడి నాయనర్ 
    5.     మైపోరుల్ నాయనార్ 
    6.     విరల్మిండ నాయనార్
    7.      అమర్నీతి నాయనార్ 
    8.     ఎరిబత్త నాయనార్ 
    9.     ఏనాదినాధ నాయనర్ 
    10.  కన్నప్ప నాయనర్ 
    11. గుంగులియకలయ నాయనర్ 
    12. మానక్కంజార నాయనార్ 
    13.అరివాట్టాయ నాయనర్ 
    14.ఆనయ నాయనర్ 
    15.మూర్తి నయనార్  
    16.మురుగ నాయనార్ 
    17.రుద్ర పశుపతి నాయనార్ 
    18. తిరునాళై పోవార్ నాయనార్ (నందనార్)
    19. తిరుకురిప్పు తొండ నాయనార్ 
    20. చండేశ్వర నాయనార్ 
    21. తిరునావుక్కరసు నాయనార్ 
    22.కులాచ్చిరై నాయనార్ 
    23.పెరుమిఝ్నాలై కూరుంబ నాయనార్ 
    24. కారైకాల్ అమ్మైయార్ 
    25. అప్పూడి నాయనార్ 
    26. తిరు నీలనక్క నాయనార్ 
    27. నమి నంది యడిగళు నాయనార్ 
    28.తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ 
    29. ఏయర్కోన్ కలికమ్మ నయనార్ 
    30. తిరుమూల నాయనార్ 
    31. దండి యడిగళు  నాయనార్ 
    32. మూర్ఖ నాయనార్ 
    33.సోమసిమార నాయనార్ 
    34. సాక్కియ నాయనార్ 
    35. సిరపుల్లియార్ నాయనార్ 
    36. చిరుతొండ నాయనార్ 
    37. చేరమాన్ పెరుమాళ్ నయనార్ 
    38. గణనాధ నాయనార్ 
    39. కూట్రువ నాయనార్ 
    40. పుగళ్ చోళ నాయనార్ 
    41. నరసింగ మునైయరైయ నాయనార్ 
    42.  అధిపత్త నాయనార్
    43.కలికంబ నాయనార్ 
    44. కలియ నాయనార్ 
    45. సత్తి నాయనార్ 
    46. ఐయడిగళ్ కాదవర్కోన్ నాయనార్ 
    47.కణంపుల్ల నాయనార్ 
    48. కారి నాయనార్ 
    49. నిన్రసీర్ నెడుమార నాయనార్ 
    50.మంగయార్కరసియర్ నాయనార్ 
    51. వాయిలర్ నాయనార్ 
    52. మునైయడువార్ నాయనార్ 
    53. కళర్ సింగ నాయనార్ 
    54. సెరుత్తుణై నాయనార్ 
    55. ఇడంగళి నాయనార్ 
    56.పుగళ్త్తుణై నాయనార్ 
    57. కోట్పులి నాయనార్ 
    58. పూసలార్ నాయనార్ 
    59. నేస నాయనార్ 
    60. కొచ్చెంగ చోళ నాయనార్ 
    61. తిరునీల కంఠయాళ్ పాణ నాయనార్ 
    62. శడైయ నాయనార్ 
    63.ఇసై జ్ఞానియర్ నాయనార్ 

    ఓం నమః శివాయ