సీ : కల్పపర్యంతంబు గల్గు దేహంబని
భ్రమసి చేసితి నెన్నొ పాతకములు
ద్రవ్యార్జనంబె యాదరువు రక్షణమని
మోహించి గడియింని మోసపోతి
ఆభాస
భాంధవు లాత్మయుత్తారకు
లనియెంచి దరిజేర్చి ఆశచెడితి
అన్య
దేవతలె నాకాత్మ రక్షకులంచు
కొలిచి శాశ్వత గతి కోలుపోతి
తే :
భక్తవరులను
డాయంగ ముక్తి నొసగ
శ్రీనివాసుడె
కర్తయో ననగ వింటి
చేరి నిను వేడుకొంటిని చేయివిడకు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి