భృగువు నవ బ్రహ్మలలో ఒకడు ఇతని భార్య ఖ్యాతి, దేవహుతి, కర్దమ ప్రజాపతిల పుత్రిక. వీరికి ఒక కుమార్తె ఉన్నది. ఆమే భార్గవి. ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు. వారు
- దాత
- విధాత
పుత్రులు ఇద్దరూ మేరు పర్వత పుత్రికలను వివాహం చేసుకున్నారు.
- దాత భార్య యాయతి: వీరి పుత్రుడు మృకండుడు, మృకండుని పుత్రుడే మార్కండేయుడు
- విధాత భార్య నియతి: వీరి పుత్రుడు మహర్షి వేదశిరుడు
భృగు మహర్షి కి ఉశన అనే మరో భార్య యందు ఉశనసుడు (శుక్రుడు) జన్మించాడు.