సీ: నీనామములు సహస్రానీకములు
గాన
ఏ నామమున బిల్వ నేర్తునిన్ను
బహు రూపములు నీకు భావ్యమై
యుండగ
ఏ రూపమని నిన్ను నేర్పరింతు
కళ్యాణగుణములు కల వనంతంబులై
ఏగుణమ్మన నిన్ను నెంచుకొందు
సకల లోకాలలో సర్వంబు
నీవౌట
యెందు గలవీవని యెరుగ
గలను
తే : క్షితిని నిను జూచు
వారేరి చిద్విలాస
మలినమతి నేను నిన్నెట్లు
దెలియనేర్తు
వచ్చి కాపాడు శరణము జొచ్చినాడ
అందుకొనవయ్య శ్రీరామ
వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి