సీ : జానకీ దేవి నా సంవెదనం బాపి
రక్షించ వినిపించు రామునకు
మాయమ్మ
నీవెప్డు మాతప్పులెల్లను
మన్నించ వినిపించు మాధవునకు
కమలనేత్రినాదు
కలుషజాలమడంచి
తప్పించ వినిపించు దాశరధికి
లోకమాతా
నాదు లోలత్వ మణగించి
లోకేశు మెప్పించు లోకమెరుగ
తే: ఇందిరాదేవి మాతల్లి ముందె యుండి
పురుషకారము చేయుము మ్రొక్కులిడుచు
ననుచు ప్రార్ధింతు మాయమ్మ నామె
ద్వార
అందుకొనవయ్య శ్రీరామ వందనములు
!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి