సీ : ప్రకృతి గుణంబులు బాగుగానను జేరి
ప్రకృతి వశ్యుని జేసె
ప్రాజ్ఞవినవె
సుఖ దుఃఖములు నాకు చుట్టరికంబులై
కలిమి లేములు నన్ను కెలికి
చెరచె
మదము మాత్సర్యంబు మమకార
గర్వముల్
కరణత్రయము చేత ఖలుని
జేసె
రాగద్వేషంబులు బాగుగా
నీడ్వగా
కోపతాపంబులు కోరిచేరె
తే: ద్వంద్వములు
నన్ను నీడ్వగా తపనపొంది
తండ్రి నిను జేరజాలక తలతునిదిగొ
వరద గోవింద వామన వాసుదేవ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి