11, ఆగస్టు 2018, శనివారం

పంచకృత్యములు

భగవానుడు ముఖ్యం గా చేసే పనులు ఐదు. వానిని పంచకృత్యములు అంటారు. అవి

  1. సృష్టి : సకల చరాచర జీవుల వృద్ధి ని సృష్టి అంటారు
  2. స్థితి : సృష్టించిన జీవరాశి మనుగడ క్రమశిక్షణ న్యాయాన్యాయ క్రమాక్రమ విచక్షణ భారమును వహించుటను స్థితి అంటారు 
  3. సంహారం : స్థూలరూపంలో ఉన్న  సూక్ష్మీకరించటాన్ని సంహారం అంటారు 
  4.  తిరోభావం : సూక్ష్మీకరించబడిన దానిని తిరిగి స్థూల రూపముగా సృష్టించి వరకూ కాపాడటాన్ని తిరోభావం అంటారు 
  5. అనుగ్రహం : పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు 

9, ఆగస్టు 2018, గురువారం

శ్రీ మహా విష్ణు రూపములు

భాగవతం మొదలగు పురాణములలో శ్రీ మహా విష్ణు  గురించి వర్ణించ బడినది. అయితే శ్రీ మహా విష్ణు కు ముఖ్యమయినవి, భక్తులను అనుగ్రహించుటకు సులభ మయినవి ఐదు రూపములు ఉన్నాయి. అవి

  1. పర రూపం  : ఈ రూపం శ్రీ వైకుంఠం లో ఉండే విష్ణుమూర్తి 
  2. వ్యూహా రూపం : ఈ రూపం పర రూపం నుండి వచ్చినది. ఇది ప్రాపంచిక సౌఖ్యములను ఇవ్వగలిగినవి,అవి నాలుగు రూపములు అవి 
    • వాసుదేవ 
    • సంకర్షణ 
    • ప్రద్యుమ్న 
    • అనిరుద్ధ  
  3. విభవ రూపము : ఇవి అవతారములు 
  4. అంతర్యామి : సకల చరాచర జీవరాశి ఆత్మలలో ఉండే రూపం 
  5. అర్చా రూపం : ఆ దేవదేవుని మనం కనులతో చూడలేము కనుక వానిని స్థూల రూపం లో ఉంచి పూజించే రూపం 


7, ఆగస్టు 2018, మంగళవారం

ఆంగ్ల మాసములు - రోజులు

మనలో కొందరికి ఇప్పటికీ ఆంగ్ల మాసములలో ఏ మాసమునకు ౩౦ రొజులో, ఏ మాసమునకు 31 రొజులో గుర్తు ఉండవు. దీనికోసం 1892 లోనే శ్రీ M.H. సుబ్బారాయుడు గారు వారు రచించిన “అంకగణితం” అనే పుస్తకంలో ఆ విషయములను గుర్తు ఉంచుకోవటానికి  ఒక పధ్యం రచించారు. ఆ పధ్యం మీకోసం!  

పరగముప్పది దినముల బరగుచుండు
జూను సెప్టెంబరేప్రిలు మానుగాను
తగ నవంబరుతో కూడి తధ్యమరయ
ముప్పదొక్కటి దినములు తప్పకుండ
నలరుచుండును దక్కిన నెలలయందు
ఫిబ్రవరి మూడు వర్షముల భ్రముగను
పిదుపనిరువది తొమ్మిది ఫిబ్రవరికి
నదియె లీపందురాంగ్లేయులనువుగాను