సీ : అపరాధు శిక్షించుటయె నీమతమనన్
దోషభోగ్యుడనన్న దోషమొదవు
పాపాత్ముడనివీని పారద్రోలెదవేని
పతితపావనతకు భంగమొదవు
అజ్ఞానునకు నీవు హాని జేసెదవేని
వాత్సల్యతకు నెప్డువచ్చు కీడు
శిక్షార్హుడని నీవు చేరదీయవదేని
సౌశీల్యతకు వచ్చు సామి కొరత
తే : ఇట్టి కొరతలు వచ్చుట కిష్టపడుదె
యనుచు శ్రీదేవి మిమ్మెప్పుడడుగుచుండు
గానయఘములు జూడక కావుమెపుడు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి