విషాదప్యమృతం
గ్రాహ్యమమేధ్యాదపి కాంచనం
నీచాదప్యుత్తమా
విధ్యా స్త్రీ రత్నం దుష్కులాదపి!!
భావం : విషం నుండి అమృతాన్ని, మలినముల నుండి
బంగారాన్ని, నీచుని వద్ద నుండి విధ్యను, తన కంటే తక్కువ కులములో ఉన్నా స్త్రీ రత్నమును
స్వీకరించ వచ్చును.
వివరణ: విషమును అలాగే స్వీకరిస్తే అనారోగ్యం
కలుగు తుంది. అలా కాకుండా దానిని చేయవలసిన విధంగా శుద్ధి చేస్తే అది ప్రాణములను నిలబెట్టే
అమృతం అవుతుంది. మురికిగా ఉన్నప్పుడు అత్యంత విలువైన బంగారాన్ని కూడా మనం గుర్తించలేము.
దానిని గుర్తించి, మురికిని తొలగించే నిపుణత ఉన్నప్పుడు మనకు బంగారము లభిస్తుంది. నీచుడు
(తనకంటే చిన్నవాడు) చేసే పనులలోనుండి కూడా ఉత్తమ విధ్యను నెర్చుకునే అవకాశం ఉంటుంది.
అయితే దానికి కూడా కొంత నిపుణత అవసరం. స్త్రీ రత్నం తనకన్నా తక్కువ కులంలో జన్మించినా
కూడా ఆమెను వరించ వచ్చును.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి