సీ: శైశ వంబున దేవ శరణన లేకను
మలమూత్రముల మున్గి మరచుటాయె
కౌమారదశయందుగనలేకనుండెనా
చెడు స్నేహంబులు నన్ను చేరి చెరచె
యౌవనంబున నిన్ను యర్చించ కొనకుండ
అంగనా సాంగత్యమడ్డు నిలచె
ముదియందు నిన్బక్తిమురిపించలేక నీ
చెడు రోగముల దెల్వి చెడగనాయె
తే
: శ్రీరమానాధ గోవింద శ్రీనివాస
ఎట్లు తరియింతునే దశనెట్లు గొలుతు
వేగవేంచేసి రక్షించు వేదవేద్య
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి