సీ
: నీలమేఘమువాడు నిడుద బాహులవాడు
కరుణారసము జిల్కు కనులవాడు
వెడద వక్షము వాడు వేద స్వరూపుడు
కమనీయ కంఠంబు గలుగువాడు
కనక రంభాతిరస్కారులూరులవాడు
పద్మ పత్రముమించు పదమువాడు
శ్రీవత్స చిహ్నంబు శ్రీచూర్ణరేఖలు
కరముల శంఖ చక్రముల వాడు
తే : వక్షమందున శ్రీలక్ష్మి
వాసమొంద
శేషశయ్యను బవళించ శేషజనుల
దయ కటాక్షించునను మాట
తప్పుగాదు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి