రామాయణం ప్రకారం లంకాధిపతి రావణుడు. అతని కంటే ముందు అది ధనాధీశుడు అయిన కుబేరుని ఆధీనంలో ఉండేది. అయితే లంక రక్షా జాతికి సంబందించినది అని కూడా చెప్తారు. మరి ఇంతకీ లంక అని పిలువబడే సువర్ణలంక ఎవరిది?
ఈ ప్రశ్న కు సమాధానం మనకు రామాయణంలోని ఉత్తరకాండ లో దొరుకుతుంది.
ఈ నగరాన్ని సువర్ణ మయంగా నిర్మించిన వాడు దేవతల శిల్పి విశ్వకర్మ. త్రికూటా చల పర్వతం మీద ఇటువంటి ఒక నగరమును నిర్మించమని కోరినవాడు స్వయానా ఇంద్రుడు. కాలాంతరమున ఇంద్రుడు ఆ విషయమును మరచిపోయాడు.
తరువాతి కాలంలో దేవతలమీద యుద్ధం జయించిన తరువాత రాక్షసులయిన మాల్యవంతుడు, మాలి , సుమాలి లు తమ కోసం నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని విశ్వకర్మను అడుగగా వారికి త్రికూటాచల శిఖరాలపై నిర్మించిన లంకను అతను చూపించాడు. ఆ తరువాతి కాలంలో విష్ణు భయం చేత రాక్షసులు లంకను వదలి పాతాళం లో దాక్కున్నారు. అలా లంక తిరిగి అనాధ అయ్యింది.
తరువాత కొంత కాలానికి విశ్రవసుడు తన పుత్రుడయిన వైశ్రవునకు ఆ లంకను నివాస భూమిగా నియమించాడు. అలా ఆ లంక కొంతకాలం యక్షులకు నిలయం అయ్యింది.
ఆ తరువాత అదే విశ్రవసుని పుత్రుడయిన దశకంఠుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు. అలా మరలా లంక రాక్షసుల నిలయం అయ్యింది.

Good
రిప్లయితొలగించండిJai dsukfsgkngFhkogdfjogxsbml jxd zrkbv
రిప్లయితొలగించండి