ఈ మాట మనకు సహజంగా పెద్దల నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల కంటే ఇంతకూ ముందు ఉన్న మారోజులే బాగుండేవి అని చెప్పే సందర్భంలో ఈ పద్య పాదమును వాడుతూ ఉంటారు. అయితే ఈ పద్య పాదం ఎక్కడిది?
ఈ పద్యపాదం నన్నయ ఆంధ్రీకరించిన మహా భారతంలోని ఆది పర్వంలోనిది. ఆది పర్వం పంచమాశ్వాసం లో 159వ ఆ పద్యం మీకోసం
మతిఁ దలఁపఁగ సంసారం
బతి చంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణి కంబులు
గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్
ఈ పద్యము సాక్షాతూ వ్యాసుడు తన తల్లి సత్యవతి తో మాట్లాడుతున్న సందర్భం లోనిది. ఆమెను ఇక వానప్రస్థము స్వీకరించమని చెప్తున్న సందర్భంలోనిది. కానీ ఈ పద్య భావం మనకు అన్ని సందర్భాలలోనూ అన్వయించుకోవటానికి అనువుగా ఉంటుంది.
భావం: మనస్సులో అలోచించి చూస్తే ఈ సంసారం ఎండమావుల వలే చాలా చంచలమైనది. సంపదలు ఎంతో కాలం నిలువవు. కావున రాబోయే రోజులకంటే ఎల్లప్పుడూ గడచిన రోజులే మేలు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి