అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము. ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!
- బీజాగ్రము:: నామ రూప రహిత, అఖండ పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన బీజాగ్రము
- జాగ్రము:: ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు చెందుట జాగ్రము
- మహాజాగ్రము:: ప్రపంచము లో వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
- జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
- స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
- స్వప్నజాగ్రము:: ఇంతకు ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
- సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి