స్కంద పురాణములో ప్రతి సంవత్సరము లో వచ్చే పన్నెండు నెలలో ఏ నెలలు ముఖ్యమయినవి అని, ఆ యానెలలలో ఏమి చేయాలి అని చెప్పారు.
భావం : అన్ని మాసములలో విశిష్టమయిన మాసములుగా కార్తీకం, మాగము మరియు మాధవం అని పిలువబడే వైశాఖం ముఖ్యమయినవి.
మరి అంత విశిష్ట కలిగిన ఈ వైశాఖ మాసంలో ఏమి చేస్తే మానవునకు మంచి జరుగుతుంది? మానవునికి మంచి జరుగుతుంది అని చెప్పటంలో మన పెద్దల దృష్టి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. మనకి మంచి జరగాలి అంటే మనం ఈ సమాజానికి ఎం చేయగలం అని అర్ధం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ వైశాఖ మాసంలో ఏమి చెయ్యాలో కింద శ్లోకంలో చెప్పారు.
భావం: అనేక మంది నడిచే మార్గమద్యములో ఒక చలివేంద్రము ఏర్పరచి వైశాఖమాసములో ఎవరయితే బాటసారులకు మంచినీటిని అందిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషునకు, అతనితో పాటు అతని వంశమునందు జన్మించిన తరువాతి అనేక తరముల వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది.
తతో మాసా విశిష్ట్యోక్తాః కార్తీకోమాఘఏవచా
మాధవ స్తేషు వైశాఖం మాసానాముత్తమం వ్యధాత్
మరి అంత విశిష్ట కలిగిన ఈ వైశాఖ మాసంలో ఏమి చేస్తే మానవునకు మంచి జరుగుతుంది? మానవునికి మంచి జరుగుతుంది అని చెప్పటంలో మన పెద్దల దృష్టి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. మనకి మంచి జరగాలి అంటే మనం ఈ సమాజానికి ఎం చేయగలం అని అర్ధం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ వైశాఖ మాసంలో ఏమి చెయ్యాలో కింద శ్లోకంలో చెప్పారు.
మార్గే ధ్వగానాంయోమర్త్యః ప్రపాదానంతకరోతిహి
సంకోటికులముద్ధృత్య విష్ణులోకే మహీయతే
భావం: అనేక మంది నడిచే మార్గమద్యములో ఒక చలివేంద్రము ఏర్పరచి వైశాఖమాసములో ఎవరయితే బాటసారులకు మంచినీటిని అందిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషునకు, అతనితో పాటు అతని వంశమునందు జన్మించిన తరువాతి అనేక తరముల వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి