మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి కూడా తెలుసుకున్నాం కదా! తరువాత వరరుచి ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం!
విక్రమాదిత్యుని ఆస్థానంనుండి బయటకు వచ్చి, దేశాటన చేస్తూ వరరుచి కేరళ చేరుకున్నాడు. అలా గమ్యం లేకుండా తిరుగుతున్న అతనిని ఒక బ్రాహ్మణుడు అతని ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన వరరుచి అతని ఇంట్లో భోజనాన్ని స్వీకరించాలంటే కొన్ని షరతులు పాటించాలని చెప్పాడు.
- అతనికి వడ్డించే భోజనం 1008 రకాల వంటకాలతో ఉండాలి,
- ఆ ఆహారాన్ని తిన్న తరువాత అతను నమలటానికి నలుగురు కావాలి
- ఆ భోజనం తిన్నతరువాత అతను నిద్రపోతున్నప్పుడు అతనిని నాలుగురు తమ భుజాలమీద మోస్తూ ఉండాలి
- అల్లంవేసిన పెరుగు (కేరళ సంప్రదాయం ప్రకారం ఇది 1008 రకాల ఆహారం తో సమానం)
- భోజనం ఆరగించిన తరువాత అతనికి ఆకు, వక్క, సున్నం, యాలకలు ఇచ్చారు నమలటానికి
- అతను నిద్రపోవటానికి మంచం వేశారు. అతను నిద్రపోతున్నప్పుడు ఆ మంచానికి ఉన్న నాలుగు కాళ్ళు అతనిని మోస్తాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి