మనం ఇంతకు ముందు నక్షత్రముల అధిపతుల గురించి, నందిని ధేనువు గురించి చెప్పుకున్న సందర్భంలో మనం అష్టవసువులు గురించి విన్నాం! ఇంతకీ ఈ అష్టవసువులు ఎవరు?
వీరి పేర్లు గురించి అనేక సందర్భాలలో అనేక రకములుగా చెప్పినా, మహాభారతంలోని ఆదిపర్వంలో చెప్పిన ఈ కింది శ్లోకంలో వారి పేర్లు చెప్పారు
ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో అనలః
ప్రత్యూష శ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః
- ధరుడు
- ధ్రువుడు
- సోముడు
- అహస్సు
- అనిలుడు
- అనలుడు
- ప్రత్యూషుడు
- ప్రభాసుడు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి