సీ : హెచ్చుతగ్గులు
లేక ఎవరువచ్చిన నేను
మెచ్చెదననుమాట యెచ్చటుండె
మెచ్చుకోలుకు
నేను యిచ్ఛగించనటంచు
ముచ్చటించితివేల ఖచ్చితముగ
మచ్చిక నీరూపు
వచ్చి చూపించుము
లచ్చికి జోహారు లెచ్చు తెలుపు
పచ్చవిల్తుని తండ్రి రచ్చకీడ్వకునన్ను
వచ్చి కాపాడుము మెచ్చననక
తే : ఉచ్ఛదశ వీడి వేవచ్చి నచ్చవయ్య
మచ్చుకైనను నిన్వీడ పిచ్చివాడ
లచ్చియానను నీయాన
మెచ్చునన్ను
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి