సీ : పాదుకలనుగొని పాద పూజలుజేయ
భరతుండగాను సద్భక్తి తోడ
ఇంపుగా సేవలు ఎల్లవేళల జేయ
లక్ష్మణుండను గాను లక్షణముగ
ప్రాణమర్పించియు ప్రాపుగోరగ నేను
అల జటాయువుగాను యమితభక్తి
జపహోమములు జేసి సంతోషపెట్టను
ఋష్యాదులందొక ఋషినిగాను
తే : పారతంత్ర్యము
చేపట్టి తరచునేను
నిన్ను పొందగ లేనయ్య నీరజాక్ష
దయను నను జేరదీసియు భయము బాపి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి