సీ : శ్రీరమాధిపనీకు సేవజేసెదనన్న
నిన్వీడియుండరు నిత్యులెపుడు
భూరికానుకలిచ్చి పూజింతునన్నను
శ్రీలక్ష్మినిన్వీడి తొలగిపోదు
పట్టెమంచము పరుపు బట్టలిచ్చెదనన్న
పానుపయ్యెను నీకు పాపరేడు
అర్ఘ్యపాధ్యముచ్చి అర్చించెదనన్నను
క్షీరాబ్ధి నీ చెంత జేరియుండు
తే : భక్ష్యభొజ్యము
లివ్వరేభక్తవరులు
వేదగానము జేయరే వేల్పులెల్ల
ఈశ నిర్భాగ్యుడను పేదఏమియిడుదు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి