సీ : నిన్ను ధ్యానముజేసి
నేతరించెదనన్న
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
నిమిషమైన మనస్సు నిలివదాయె
నిన్నర్చనజేయుచు
నే సుఖించెదనన్న
గడియ తీరిక లేక గడుపుటాయె
దీపధూపములిచ్చి
దేవగొల్చెద నన్న
దుస్సహవాసంబు
దొలగదాయె
సద్గ్రంధ పఠనంబు
సలుపగోరెద నన్న
పారమొందని నీచపఠనమాయె
తే : ఇంక నేరీతి నిన్నాశ్రయించగలను
తే : ఇంక నేరీతి నిన్నాశ్రయించగలను
ఏమితోచక నీస్తోత్రమెపుడు జేతు
బాలునజ్ఞాని
రక్షించు భారమనక
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి