సీ : సాహాయ్యమొనరించి
సంతోషమొందించ
సుగ్రీవుడనుగాను సుమ్ముదేవ
సామర్ధ్యమునను రాక్షసరాజు వంచించ
రోషమందగను మారుతిని గాను
వేడ్కచే ప్రీతితో విందులు జేయను
శబతరిని గానంచు చాటి చెపుదు
శరణంచు నినుగోరి
సాన్నిధ్యమర్ధింప
సాహసంబున విభీషణుడ గాను
తే : భూరి కైంకర్యములు
జేయతరముగాదు
కించిరజ్ఞుని దరిజేర్చు కేలుమోడ్తు
ఆశ్రయించిన దాసుని ఆర్తి దీర్చి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి