సీ : రామ నీ రెండక్షరంబులు జపియించి
వాల్మికి మోక్షంబు వాసిగాంచె
ఖట్వాOగుడను వాడుకడుమోద మందుచు
హరిని జపించుచు పరముగనెను
నారాయణాయని నందనున్ స్మరియించి
ఆ యజామీళుడు హరిని జేరె
సభలోన శౌరినిస్మరియించి ద్రౌపది
అక్షయంబుగ వల్వలందుకొనెను
తే : ఎందరెందరొ మహనీయులిట్లునిన్ను
యెప్పుడెప్పుడు పిల్చినప్పుడపుడే
పలికిరక్షింతువన విని దలతునిన్ను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
వాల్మికి మోక్షంబు వాసిగాంచె
ఖట్వాOగుడను వాడుకడుమోద మందుచు
హరిని జపించుచు పరముగనెను
నారాయణాయని నందనున్ స్మరియించి
ఆ యజామీళుడు హరిని జేరె
సభలోన శౌరినిస్మరియించి ద్రౌపది
అక్షయంబుగ వల్వలందుకొనెను
తే : ఎందరెందరొ మహనీయులిట్లునిన్ను
యెప్పుడెప్పుడు పిల్చినప్పుడపుడే
పలికిరక్షింతువన విని దలతునిన్ను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి