సీ : ముందుమాలాకారు దండంబుగానిచ్చు
విరులదండలు నీవువేగ గొనవే
భక్తి కుబ్జిచ్చుబహు పూల దండలు
కామించి గైకొనవె కాంక్షతోడ
ఆండాళుముడిచిన హారంబులవిగొని
భోగ్యంబుగా మేనబూనలేదే
తొందరడిప్పొడితో మాలలీయగా
తిరుమేను సౌరెచ్చ దేవగొనవె
తే : దాసుకడలేదు సౌగంధి దామములును
ప్రేమయంజలి దామముల్ పెక్కుగలవు
దాచియుంచితి దయతోడ దాల్చిమేన
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
విరులదండలు నీవువేగ గొనవే
భక్తి కుబ్జిచ్చుబహు పూల దండలు
కామించి గైకొనవె కాంక్షతోడ
ఆండాళుముడిచిన హారంబులవిగొని
భోగ్యంబుగా మేనబూనలేదే
తొందరడిప్పొడితో మాలలీయగా
తిరుమేను సౌరెచ్చ దేవగొనవె
తే : దాసుకడలేదు సౌగంధి దామములును
ప్రేమయంజలి దామముల్ పెక్కుగలవు
దాచియుంచితి దయతోడ దాల్చిమేన
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి