సీ : శ్రీనివాసా
నాకు క్షితియందు నెప్పుడు
నీ నామ స్మరణమే నిత్యమొసగు
శ్రీవల్లభాయంచు
చిత్తంబులోపల
ధ్యానముండెడి రీతి జ్ఞానమొసగు
వరద దామోదర పరమాత్మయనగను
నీకీర్తనము జేయ నియతి నొసగు
నారాయణాకృష్ణ
నామంబులనుగొని
భజనంబు చేయగ
భక్తినిమ్ము
తే : మధురమై యుండు నీనామ స్మరణ మెపుడు
నాధ దయచేయు సతతము నాకు నెపుడు
పతితపావన బిరుదాంక
పరమ పురుష
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి