సీ : జన్మమేదెత్తిన
జగతిలోపల నేను
భక్తిహీనుల చెల్మి
రక్తిజేయ
ఇంపుసొంపుల నుండు
యేకధలైనను
వినజాల నీకధల్
వినగ గలను
పాషండులను జూచి
పారిపోయెదగాని
నినుదలంపని వారి
నేనుగోర
నీపూజలేజేసి
నీకధాశ్రవణముల్
గోరెడివారి నే
గోరుచుందు
తే : వినుము భవదీయ దాసులలోన నన్ను
కట్టకడపటివాడని
కరుణజూచి
దాస్యమింపుగ గొనవయ్య తండ్రి నీవు
దాస్యమింపుగ గొనవయ్య తండ్రి నీవు
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు!!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి