సీ : తప్తచక్రాంకముల్ దాల్చనినరుడెట్లు
వైష్ణవుండని పేరు వసుధ గాంచు
అర్ధపంచకనిష్ట
యాత్మకు లేకున్న
కమలనాభునిభక్తి
గలుగునెట్లు
భాగవతాచార్యుభక్తి
గొల్వకనెట్లు
భగవంతు కృపనిందు
బడయగలడు
శ్రీవైష్ణవులసేవ
జేయక యదియెట్లు
వైకుంఠ పురమందు
వాసిగాంచు
తే : భువినియాచార్యుకృప నిందు పొందెనేని
రక్తిభగవాను
డెట్లైన ముక్తి నిచ్చు
తామెయాచార్యులై
నన్ను దయనుబ్రోవ
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి