మనం ఇంతకు ముందు బ్రాహ్మణుడు, వైశ్యుల మరియు శూద్రుల నిర్వచనం తెలుసుకున్నాం కదా!ఇప్పుడు మరి మ్లేచ్ఛుని నిర్వచనం చాణక్యుని ప్రకారం ఏవిధంగా ఉందో చూద్దాం !
వాపీ కూప తడాగానామారామ
సురవేశ్మనామ్
ఉచ్ఛేదనే నిరాశంకః
స పిప్రో మ్లేచ్ఛ ఉచ్యతే!!
భావం : దిగుడు
బావులు,బావులు, చెరువులు,ఉద్యానవనములు, దేవాలయములు మొదలగు వానిని నిశ్శంకోచముగా నాశనము
చేయు వాడు (పుట్టుకతో) బ్రాహ్మణుడయిననూ వానిని మ్లేచ్ఛుడు అని చెప్పవలెను.
వివరణ :
పదిమందికి ఉపయోగపడు
వానిని నాశనంచేయుటవలన ఎవరికి ఏ ఉపయోగమూ ఉండదు. కానీ కొందరు అలా చేయుటకు వెనుకాడరు.
వారిని మ్లేచ్ఛులు అని పిలవవచ్చును అని పెద్దల మాట.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి