సీ : కమలాలయేభార్య
కమలాసనుడు బిడ్డ
దివిజులెల్లరు
నీదు సేవకులును
వేదపురుషుడు
నిన్వేవిధంబుల గొల్చు
పార్ధుండు నీప్రియ
బాంధవుండు
తల్లియే దేవకి
దయయె మోక్షంబండ్రు
ఈ జగత్తే మాయ
యిలను ప్రజలకు
నీమాయ తెలియంగ
నేనెంతవాడను
మహిమతెలియగ లేరు
మాన్యులైన
తే : నీ కృపాలేశమెంతైన నిలచియున్న
ప్రకృతి నెడబాపి
నిన్నింక మరువగలనె
దాతవై నన్ను
దరిజేర్చు ధర్మపరుడ
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి