మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

రేవతి నక్షత్రం
వృక్షం : విప్ప
శ్లోకం : రేవతీత్రి తారాశ్చ మధువోమత్స్యాకృతిః
రక్త వర్ణమయూరశ్చ మందార మకరతం తధా!
రక్త వర్ణమయూరశ్చ మందార మకరతం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 105 నుండి 108 వరకు గల శ్లోకములు రేవతి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : రేవతి నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన సమయమునకు కావలసిన సహాయం అందుతుంది. నూతన వ్యాపారములలో, బృహత్తర భాద్యతలు స్వీకరించటం, వానిని నెరవేర్చటంలో ముందుంటారు. దీర్ఘకాలిక వ్యాదులు దరి చేరవు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి