మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
శ్రవణ నక్షత్రం

వృక్షం : తెల్ల జిల్లేడు
శ్లోకం : శ్రోణాత్రితారాశ్చ న్యగ్రోధోదీషుమత్యాకృతిః
కృష్ణమయూరజాతి పుషశ్చ మౌక్తికంచైవపుకాశితః
కృష్ణమయూరజాతి పుషశ్చ మౌక్తికంచైవపుకాశితః
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 85 నుండి 88 వరకు గల శ్లోకములు శ్రవణ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : శ్రవణ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఆర్ధిక సమస్యలు తొలగుతాయి. మానసిక సమస్యలు తొలగుతాయి. సకల కార్యములు విజయవంతం అవుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి