ఈ రోజులలో ఒక తండ్రి తన కొడుకుతో ఏ వయస్సులో ఎలా ఉండాలో చెప్తారు కదా! దానికి మూలమయిన సంస్కృత శ్లోకం ఏదో చూద్దామా!
ఈ శ్లోకం చాణక్య నీతి దర్పణంలో ఉన్నది.
ఈ శ్లోకం చాణక్య నీతి దర్పణంలో ఉన్నది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్
ఈ శ్లోకమునకు అర్ధం: కొడుకునకు ఐదు సంవత్సరములు వచ్చేవరకు లాలించాలి. గారాబం చేయాలి. ఐదు నుండి పది సంవత్సరముల వరకు మంచి చెడులు నేర్పేందుకు దండించాలి. పదహారు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత మిత్రునిగా చూడాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి