నాయన్మారులు / నాయనారులు అంటే 63 మంది మహా శివ భక్తులు. వీరి గురించి చెప్పే పురాణం "పెరియపురాణం". దీనిని చోళ రాజుల వద్ద మంత్రిగా ఉన్న "సెక్ఖియార్" అనే పండితులు రచించారట.
కేవలం 63 మందే ఎందుకు? శివ భక్తులు కేవలం 63 మందేనా? ఇంకా ఎక్కువ ఉండేవారు కాదా! ఇప్పుడు లేరా?
ఎందరో ఉన్నారు. అంతకు చాలా రెట్లు ఉంటారు. మరి కేవలం 63 మంది గురించి మాత్రమే ఎందుకు చెప్పారు? ఇది కేవలం ఆ మహాదేవుడు భక్తులను తనవైపుకు ఏ విధంగా లాక్కుని తెచ్చుకోగలడో చెప్పే ప్రయత్నం మాత్రమే.
వీరు 63 మంది తమ శైవ సిద్దాంతాన్ని ప్రచారం చేసారు. వీరు సర్వధా పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ ఉండేవారు.
వారి పేర్లు
- 1. సుందర మూర్తి నాయనార్2. తిరు నీలకంఠ నాయనార్3. ఇయర్ పగై నాయనర్4. ఇల్లయాన్గుడి నాయనర్5. మైపోరుల్ నాయనార్6. విరల్మిండ నాయనార్7. అమర్నీతి నాయనార్8. ఎరిబత్త నాయనార్9. ఏనాదినాధ నాయనర్10. కన్నప్ప నాయనర్11. గుంగులియకలయ నాయనర్12. మానక్కంజార నాయనార్13.అరివాట్టాయ నాయనర్14.ఆనయ నాయనర్15.మూర్తి నయనార్16.మురుగ నాయనార్17.రుద్ర పశుపతి నాయనార్18. తిరునాళై పోవార్ నాయనార్ (నందనార్)19. తిరుకురిప్పు తొండ నాయనార్20. చండేశ్వర నాయనార్21. తిరునావుక్కరసు నాయనార్22.కులాచ్చిరై నాయనార్23.పెరుమిఝ్నాలై కూరుంబ నాయనార్24. కారైకాల్ అమ్మైయార్25. అప్పూడి నాయనార్26. తిరు నీలనక్క నాయనార్27. నమి నంది యడిగళు నాయనార్28.తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్29. ఏయర్కోన్ కలికమ్మ నయనార్30. తిరుమూల నాయనార్31. దండి యడిగళు నాయనార్32. మూర్ఖ నాయనార్33.సోమసిమార నాయనార్34. సాక్కియ నాయనార్35. సిరపుల్లియార్ నాయనార్36. చిరుతొండ నాయనార్37. చేరమాన్ పెరుమాళ్ నయనార్38. గణనాధ నాయనార్39. కూట్రువ నాయనార్40. పుగళ్ చోళ నాయనార్41. నరసింగ మునైయరైయ నాయనార్42. అధిపత్త నాయనార్43.కలికంబ నాయనార్44. కలియ నాయనార్45. సత్తి నాయనార్46. ఐయడిగళ్ కాదవర్కోన్ నాయనార్47.కణంపుల్ల నాయనార్48. కారి నాయనార్49. నిన్రసీర్ నెడుమార నాయనార్50.మంగయార్కరసియర్ నాయనార్51. వాయిలర్ నాయనార్52. మునైయడువార్ నాయనార్53. కళర్ సింగ నాయనార్54. సెరుత్తుణై నాయనార్55. ఇడంగళి నాయనార్56.పుగళ్త్తుణై నాయనార్57. కోట్పులి నాయనార్58. పూసలార్ నాయనార్59. నేస నాయనార్60. కొచ్చెంగ చోళ నాయనార్61. తిరునీల కంఠయాళ్ పాణ నాయనార్62. శడైయ నాయనార్63.ఇసై జ్ఞానియర్ నాయనార్
ఓం నమః శివాయ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి