పృషద్ధ్రుడు వైవస్వత మనువు యొక్క పుత్రుడు. అంటే సూర్య వంశస్థుడు.
విద్యాభ్యాసం చేస్తున్న సమయలో ఒకరోజు పృషద్ధ్రుడు ఆవుల మందను తీసుకుని అడవులకు వెళ్ళగా, పెద్ద వర్షం ప్రారంభం అయినది. అప్పుడు అతను ఆ ఆవులను అన్నింటిని ఒకచోటికి చేర్చి వాటిని అన్ని వైపుల నుండి కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక పులి ఆ మందలో ఉన్న ఆవులపై దాడి చేసినది. ఐతే విపరీతమైన చీకటిగా ఉండుటవలన అతనికి ఆ ఆవుల మంద మధ్యలో పులి ఎక్కడ ఉన్నదో తెలియలేదు. కానీ సాహసవంతుడై తన కత్తిని తీసి తను పులిగా భావిస్తున్న జంతువును మెడమీద ఒక్క దెబ్బ వేసాడు. అయినా పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉండుట విని రెండవసారి తన కత్తిని బలంగా ప్రయోగించాడు. ఈసారి ఆ జంతువు తల త్రెగి ప్రక్కన పడినది.
వర్షం తగ్గగానే తను నరికిన తల ఒక ఆవుది అని తెలుసుకుని తమ కుల గురువయిన వసిష్టుని వద్దకు వెళ్లి జరిగినది చెప్పాడు. గోహత్యా పాపం అత్యంత ఘోరమైనది కనుక పృషద్ధ్రుడు క్షత్రీయత్వమునకు అనర్హుడని, చండాలునిగా ఉండమని శపించాడు.
అలా శాపం పొందిన పృషద్ధ్రుడు గురువుగారి అజ్ఞ తీసుకుని అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ అన్ని జీవులయందు సమదృష్టి కలిగి, పిచ్చి వాని వలే ఈ విధమైన కోరికలు లేకుండా, ఏది దొరికితే అది తిని కాలం గడిపి చివరకు అరణ్యములో పుట్టిన దావానలం లో చిక్కుకుని తన ప్రాణములను వదిలాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి