సూర్యవంశం లో జన్మించిన ఇల, వసిష్టుని కారణం గా సుద్యుమ్నునిగా(పురుషునిగా) మారినది. సుద్యుమ్నుడు తన తండ్రి అయిన వైవస్వతమనువు రాజ్యమును చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు.
ఒకసారి సుద్యుమ్నుడు తన సైన్యంతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. అతిశయించిన ఉత్సాహంతో ఉత్తర దిశగా క్రూరమృగములను తరుముతూ వెళ్లారు. అలా వెళ్లి వెళ్లి చివరకు స్త్రీవనములో ప్రవేశించారు. వెంటనే పరమేశ్వరుని అజ్ఞానుసారం సుద్యుమ్నుడు మరలా స్త్రీగా (ఇలగా)మారి పోయాడు. అతనితో పాటుగా అక్కడకు వచ్చిన అతని సైన్యంకూడా స్త్రీలుగా మారిపోయారు.
ఈవిధముగా అనుకోని పరిస్థితులలో స్త్రీలుగా మారిన వారు ఆ అడవుల్లోనే నివసించసాగారు. ఇల రాకుమార్తె వలే నివసించుచుండగా, సైనికులు ఆమెకు చెలికత్తెలై ఉన్నారు. వారు ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒకరోజు చంద్రుని కుమారుడయిన బుధుని (నవ గ్రహములలో ఒకరు) ఆశ్రమం చేరారు.
బుధుడు ఇలను చూసి మోహించాడు, వారు వివాహం చేసుకున్నారు. వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈవిధంగా చంద్రవంశం వృద్ధి ప్రారంభం అయినది.
వీరిని గురించి తెలిసిన వైవస్వతమనువు విచారం మరింతగా పెరిగినది. సూర్యవంశ వృద్ధికి కారకుడు కావలసిన తన పుత్రుడు, పుత్రిక రూపంలో చంద్రవంశ వృద్ధికి పునాదులు వేసాడు. తన మనో విచారమును తన గురువైన వసిష్టునకు విన్నవించగా, వసిష్టుడు పరమేశ్వరుని గురించి ప్రార్ధన చేసాడు.
వసిష్టుని ప్రార్ధనలు విన్న పరమేశ్వరుడు ఇలను పురుషునిగా మార్చినట్లయితే అతని శాపం తప్పినట్లు అవుతుంది, అలా కాకుండా ఆమెను స్త్రీగానే ఉంచేస్తే, వసిష్టుని సంకల్పం తప్పినట్లు అవుతుంది కనుక మధ్యే మార్గంగా ఆమెను ఒక నెల రోజుల పాటు పురుషునిగా, మరో నెల రోజులు స్త్రీ గా ఉండే ఏర్పాట్లు చేసారు.
అప్పటినుండి పురుషునిగా ఉన్న నెలరోజులు రాజ్యపాలన చేస్తూ, స్త్రీగా ఉన్న నెలరోజులు ఇలగా అంతఃపురంలో జీవనం సాగిస్తూ ఉన్నాడు.
సుద్యుమ్నునకు అతని భార్య వలన ముగ్గురు కుమారులు జన్మించారు. వారు ఉత్కళుడు, గయుడు మరియు విమలుడు. వీరు ముగ్గురు అత్యంత ధర్మ పారాయణులు, వీరు ఉత్తర దిశలో గల రాజ్యమును పరిపాలించారు.
సుద్యుమ్నుడు వృద్ధాప్యం వచ్చేవరకు రాజ్యపాలన చేసి, అవసాన దశలో తన పుత్రుడయిన పురూరవునకు ప్రతిష్టానపురము అనే రాజ్యమును ఇచ్చి వనములకు వెళ్ళాడు.
నా ఆలోచన:
ఇంతకు ముందు చెప్పినట్లు మన పూర్వీకులకు లింగమార్పిడి గురించిన అద్వితీయమైన జ్ఞానం ఉన్నది. నిస్సంకోచముగా! ఎందుకంటే (నాకు తెలిసినంత వరకు) ఈ రోజులలో జరుగుతున్న లింగ మార్పిడి కేవలం శారీరక మైనది. అలా లింగ మార్పిడి జరిగిన ఎవరూ మార్పు చెందిన లింగమునకు సంబందించిన జీవ ప్రక్రియలు చేయలేరు. ఒక పురుషుడు స్త్రీగా మారితే అతను మిగిలిన స్త్రీలవలే గర్భధారణ చేసే అవకాశం ఉండదు. ఒక స్త్రీ పురుషునిగా మారితే ఆమె మరొక స్త్రీ ద్వారా పుత్రులను పొందుట అసంభవం.
కాని పూర్వకాలం లో ఇల/సుద్యుమ్నుని విషయంలో వారు తప్పని సరిగా విజయం సాధించారు. స్త్రీగా ఉన్న ఇల పురూరవునికి జన్మను ఇచ్చినది. పురుషునిగా ఉన్నపుడు తన భార్య ద్వారా మ్రుగ్గురు పుత్రులను పొందటంజరిగింది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి