ఉపపాండవులు మహాభారత యుద్ధం ముగిసిన సమయంలో ఒక అర్ధరాత్రి వేళ అశ్వద్ధామ చేతిలో పాశవికంగా చంపబడ్డారు. వారు అలా వివాహం కాకుండా, స్పృహలో లేని సమయంలో చనిపోవటానికి కారణం ఉన్నది.
త్రేతాయుగ కాలంలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడుని పరిక్షిస్తున్న సమయంలో ఒకసారి అతని మీదకు కర్రను ఎత్తాడు. ఆ సమయం లో ఆ సంఘటనను చుసిన ఐదుగురు విశ్వేదేవతలు విశ్వామిత్రునిపై కోపించి అతనిని ఎదిరించారు.
ఓ విశ్వామిత్రా! ఇది అన్యాయం కదా! ఒక మానవుని నీవు ఇంతగా భాదపెడుతున్నావు. ఇది నీకు ధర్మమా?
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు వారి అజ్ఞానానికి చింతించి, " ఓ విశ్వేదేవతలారా! మీకు ఏమి తెలుసని ఇలా నాగురించి తప్పుగా అనుకుంటున్నారు? నేను ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో తెలియకుండానే మీరు అనవసరంగా నా పనికి అడ్డు పడుతున్నారు. ఈ క్రియకు మీకు తప్పని సరిగా శిక్ష విధించ వలసినదే! మీరు ఈ బులోకం లో మానవులుగా జన్మించండి"
తమ తప్పు తెలుసుకున్న విశ్వేదేవతలు విశ్వామిత్రుని ఈ సంసార జంఝాటం తమకు వద్దు అని కోరగా, విశ్వామిత్రుడు వారికి వివాహం కాక మునుపే ఒక అర్ధరాత్రి వేళ ముక్తి లభిస్తుంది అని చెప్పారు.
కాలాంతరంలో వారే ఉపపాండవులుగా జన్మించారు అని చెప్తారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి