మనిషికి తనలోనే కొన్ని శత్రువులు ఉన్నారు అని చెప్తారు. ఆ శత్రువులనే అరిషడ్వర్గములు అంటాము. అవి ఆరు.
- కామము : కంటిని ఆకర్షించిన ప్రతిదీ సొంతం చేసుకోవాలన్న కోరిక
- క్రోధము : కోరినది తనకు దక్కలేదన్న కోపం తీవ్ర స్థాయిలో యుండుట
- లోభము : తనదగ్గర ఉన్న ప్రతిదీ ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకొనుట
- మోహము : తనవారు అనుకున్నావారే తన ప్రపంచం అన్నట్లు ఇతరులను ద్వేషించుట
- మదము : అందరికన్నా తాను ఉన్నతుడను అనే అహంభావం
- మత్సరము : తన వద్దలేనిది మరొకరి వద్ద ఉన్నదనే అసూయ
మానవడు ఒకసారి వీనిలో ఏ ఒకాదానికి వశుడు అయినా మిగతావి అతనిలో కి వచ్చి చేరుతాయి. ఆటను క్రమంగా తన విచక్షణా శక్తిని కోల్పోతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి