మన శరీరం పని చేయుటకు దానిలో తిరుగుతున్న వాయువే కారణం. మన శాస్త్రముల ప్రకారం మన శరీరం లో పది వాయువులు ఉంటాయి. వాని పేర్లు, అవి చేసే పనులు మీకోసం
- ప్రాణము : మన ఉచ్ఛ్వాసనిశ్వాసములతో మనం ఉన్నాము అని తెలియచేస్తుంది
- అపానము : తిన్న ఆహారములను విసర్జించుటకు (బయటకు నెట్టుటకు) ఉపయోగపడుతుంది
- వ్యానము : శరీరం వంగుటకు కారణం
- ఉదానము : శరీరం లో కామ ప్రచోదనం చేస్తుంది (శరీర భాగాలు అదురుటకు కూడా కారణం)
- సమానము : జీర్ణం ఐన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానం గా ప్రసరింపచేస్తుoది
- నాగము : జీర్ణాశయం లో అధిక వాయువు ఉండకుండా సహాయం చేస్తుంది (త్రేపు)
- కూర్మము : కన్నులు తెరుచుటకు ఉపయోగించునది
- కృకరము : ఆహారం మింగుటకు సహాయపడుతుంది (తుమ్ము)
- దేవదత్తము : ఇంద్రియములు పనిచేయుటకు సహకరిస్తుంది (ఆవులింత)
- ధనుంజయము : శరీరం లో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉంటుంది. (హృదయ స్పందనకు కారణం)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి