మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఆరు భాగములు చెప్పుకున్నాం కదా! ఈ భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు.
సంస్కృత శ్లోకం:
ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా
యమర్థాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః
తనుదా నెఱుగుటయోరిమి, యునుబేదలకిడుట వేగ మొందమియునులే
నినరులు తగరీపదవికి, వినుజ్ఞానము లేమిదాని విధమెట్లన్నన్
భావం: ఆత్మజ్ఞానము, ప్రయత్నము, దుఃఖములను ఓర్చుకొనగలిగిన శక్తి, ధర్మానికే ఎల్లవేళలా కట్టుబడి ఉండడం అనేవి ఎవరికి తన మార్గంలో ఆటంకములు కావో వారినే పండితులు అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి