సీ: సంసార రొంపిలో
స్తంభంబు కూరిన
ట్లయ్యెను నావిధ మరసిచూడ
శ్లేష్మంబునంబడి లేవనేరక
యీగ
తపియించు కరణి నాతపన
యయ్యె
కారాగృహంబందు నేరస్థు
కైవడి
దేహబాధల తగిలి దీనునైతి
పెనుతుపానుకు జిక్కి
పీడింపబడు నోడ
విధమయ్యె యీదేహి వింతగాను
తే: ఘోరకృత్యంబు
లెల్లను కోరికోరి
చేసి నరకంబు చేరను సిద్దమైతి
రమ్మునను గని దరిజేర్చరా మురారి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి